Yellamma Movie | వంద మంది జానపద కళాకారులతో “ఎల్లమ్మ” ఆటపాట
దేవిశ్రీప్రసాద్ హీరోగా నటిస్తోన్న ఎల్లమ్మ మూవీ టైటిల్ సాంగ్ కోసం వంద మంది జానపద సంగీతకారులు పనిచేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు బలగం ఫేమ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు.
Entertainment | Published On Oct 30, 2026, 6.42 pm IST
ఎల్లమ్మ మూవీతో టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad )కథానాయకుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. తెలంగాణ (Telangana ) బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 5న తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది.
టైటిల్ సాంగ్...
ప్రస్తుతం ఎల్లమ్మ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్ పనులు జరుపుతున్నారు. ఎల్లమ్మలో హీరోగా నటిస్తూనే ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 100 మంది జానపద రిథమ్ ప్లేయర్లతో ఎల్లమ్మ టైటిల్ సాంగ్‌ను రికార్డ్ చేస్తున్నారు. ఈ రికార్డింగ్‌కు సంబంధించిన ఫొటోలను దేవిశ్రీప్రసాద్ అభిమానులతో పంచుకున్నారు. అనేక భాషలు, వివిధ సంస్కృతులకు చెందిన జానపద సంగీత కారులు ఇందులో పాల్గొన్నారు. ఫోక్ స్టైల్‌లో సాగే ఈ పాట సినిమాకు హైలైట్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఎల్లమ్మ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
డప్పు వాయిద్యకళాకారుడిగా...
ఎల్లమ్మ మూవీలో పర్షి అనే వెనుకబడిన కులానికి చెందిన డప్పు వాయిద్యకళాకారుడిగా దేవిశ్రీప్రసాద్ కనిపించబోతున్నారు. అనంతిక సనీల్‌కుమార్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్(Prakash Raj) ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. బలగం తర్వాత వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ott Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – తెలుగు సినిమాలు హైలైట్…
అక్టోబర్ 30, 2026

Web Series Review | రుద్రవనం రివ్యూ – ట్విస్ట్‌లతో సాగే తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
అక్టోబర్ 30, 2026

Janhvi Kapoor | ఆ అవమానం జీవితాంతం మోయాల్సిందే – పెద్ద వివాదంపై జాన్వీకపూర్ రియాక్షన్
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●Ramchandar Rao | మియాపూర్ భూములు అమ్మేస్తామంటే ఊకోం
- ●Ponnam Prabhakar | అమిత్ షా యాత్ర మోదీపై వ్యతిరేకతకు సంకేతం కాదా?
- ●Nora Fatehi | మనీలాండరింగ్ కేసులో నోరా ఫతేహీకి కోర్టు సమన్లు!
- ●Pooja Hegde | ఆగిపోయిందనుకున్న సినిమా సెట్స్‌పైకి - వయసులో ఐదేళ్లు చిన్న హీరోతో పూజా హెగ్డే రొమాన్స్
- ●Harish Rao Letter to Uttam Kumar Reddy | మల్లన్న సాగర్ వద్ద అక్రమ బ్లాస్టింగ్ పనులు ఆపండి.. ఉత్తమ్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ
- ●Future City | జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు!

Ramchandar Rao | మియాపూర్ భూములు అమ్మేస్తామంటే ఊకోం

Ponnam Prabhakar | అమిత్ షా యాత్ర మోదీపై వ్యతిరేకతకు సంకేతం కాదా?

Nora Fatehi | మనీలాండరింగ్ కేసులో నోరా ఫతేహీకి కోర్టు సమన్లు!

Pooja Hegde | ఆగిపోయిందనుకున్న సినిమా సెట్స్‌పైకి - వయసులో ఐదేళ్లు చిన్న హీరోతో పూజా హెగ్డే రొమాన్స్



