Yash Toxic | నో ఛేంజ్… అనుకున్న టైమ్‌కే టాక్సిక్ – పోస్టర్ ద్వారా కేజీఎఫ్ హీరో క్లారిటీ
Yash Toxic | యశ్(Yash)) హీరోగా నటిస్తున్న టాక్సిక్ (Toxic) నుంచి కొత్త పోస్టర్‌ను మేకర్స్ మంగళవారం రిలీజ్ చేశారు. ఒంటిపై టాటూలతో పవర్‌ఫుల్ లుక్‌లో ఈ పోస్టర్‌లో యశ్ కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ద్వారా రిలీజ్ పోస్ట్‌పోన్ అంటూ వస్తున్న రూమర్స్‌కు మేకర్స్ చెక్ పెట్టారు.
Entertainment | Published On Dec 9, 2025, 1.40 pm IST
యశ్ టాక్సిక్ మూవీ
Yash Toxic | కేజీఎఫ్, కేజీఎఫ్ 2 (Kgf 2) సినిమాలతో పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు యశ్ (Yash). ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. కేజీఎఫ్‌కు ముందు...కేజీఎఫ్ తర్వాత అని కన్నడ ఇండస్ట్రీ గురించి చెప్పుకునేలా చేశాయి.
కేజీఎఫ్‌తో పాటు కేజీఎఫ్ 2 సినిమాల్లో రాఖీభాయ్ పాత్రలో యశ్ అదగొట్టాడు. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో అతడి నటన, హీరోయిజం, ఎలివేషన్లకు అన్ని భాషల ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ బ్లాక్‌బస్టర్స్‌తో యశ్ ఓవర్‌నైల్‌లోనే స్టార్‌గా మారాడు. అతడితో సినిమాలు చేసేందుకు టాప్ డైరెక్టర్లు రెడీ అయ్యారు.
కానీ యశ్ మాత్రం వారందరిని కాదని మలయాళం డైరెక్టర్ గీతూ మోహన్ దాస్‌తో టాక్సిక్ (Toxic) సినిమా చేస్తున్నాడు. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ మార్చి 19న రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమా పోస్ట్‌పోన్ కానున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లకు కొత్త పోస్టర్ ద్వారా పుల్‌స్టాప్ పెట్టారు మేకర్స్. యశ్ ముఖం చూపించకుండా ఓ నయా పోస్టర్‌ను మంగళవారంరిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఒంటిపై టాటూలతో బాల్కానీపై యశ్ చేతులు చాచి నిల్చొని కనిపిస్తున్నాడు. బాల్కానీ అంచుల మొత్తం రక్తంతో తడిసిపోయి కనిపించడం ఆసక్తిని పంచుతోంది. మరో వంద రోజుల్లో టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఈ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.
టాక్సిక్‌తో పాటు మార్చి 19న థియేటర్లలో రణవీర్ సింగ్ ధురంధర్ 2 రిలీజ్ కాబోతుంది. మార్చి 26న నాని ప్యారడైజ్, మార్చి 27న రామ్‌చరణ్ పెద్ది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటన్నింటికి టాక్సిక్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది.
టాక్సిక్ మూవీలో యశ్‌కకు జోడీగా నలుగురు హీరోయిన్లు కనిపించబోతున్నారు. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియాతో పాటు రుక్మిణి వసంత్ కథానాయికలుగా నటిస్తున్నారు. హ్యుమా ఖురేషి కీలక పాత్రలో నటిస్తోంది. కన్నడంతో పాటు హిందీలో ఏకకాలంలో టాక్సిక్ మూవీని షూట్ చేస్తున్నారు.
తెలుగు, తమిళంతో పాటు మొత్తం ఆరు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
టాక్సిక్‌తో పాటు హిందీలో రామాయణ సినిమా చేస్తున్నాడు యశ్. ఇందులో రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మైథలాజికల్ మూవీ వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కాబోతుంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






