త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ritika Singh | ఐటెంసాంగ్‌లో నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ – మెగాస్టార్‌తో స్టెప్పులు

నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ రితికా సింగ్ ఐటెంగ‌ర్ల్‌గా మారింది. చిరంజీవి కాకా సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేస్తోంది. ఈ ఐటెంసాంగ్‌తో రెండేళ్ల త‌ర్వాత సిల్వ‌ర్‌స్క్రీన్‌పై రితికా సింగ్ క‌నిపించ‌బోతుంది. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న వాల్తేర్ వీర‌య్య సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Entertainment | Published On Nov 15, 2026, 3.56 pm IST

Ritika Singh | ఐటెంసాంగ్‌లో నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ – మెగాస్టార్‌తో స్టెప్పులు
Advertisement

Ritika Singh | చిరంజీవి (Chiranjeevi)హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న కాకా మూవీ సంక్రాంతికి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతుంది. క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో స‌గ‌టు మ‌ధ్య త‌ర‌గ‌తి వ్య‌క్తిగా, గ్యాంగ్‌స్ట‌ర్‌గా డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో మెగాస్టార్ క‌నిపించ‌బోతున్నారు.

మ‌ల‌యాళ బ్యూటీ...

కాకా మూవీలో ప‌లు భాష‌ల‌కు చెందిన హీరోయిన్లు న‌టిస్తోన్నారు. చిరంజీవి కూతురిగా మ‌ల‌యాళ బ్యూటీ అన‌స్వ‌ర రాజ‌న్ న‌టిస్తోండ‌గా..త‌మిళ హీరోయిన్లు నివేదా పేతురాజ్‌, స్నేహ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. తాజాగా కాకాలో మ‌రో నాయిక చోటు ద‌క్కించుకుంది. వెంక‌టేష్ గురు మూవీ ఫేమ్ రితికా సింగ్‌ మెగాస్టార్ సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేయ‌బోతుంది.

ఐటెంసాంగ్‌...

ఐటెంసాంగ్‌లో న‌టించే హీరోయిన్ కోసం ప‌లువురు బాలీవుడ్‌, టాలీవుడ్ హీరోయిన్ల‌ను అనుకున్న మేక‌ర్స్ చివ‌ర‌కు రితికా సింగ్‌ను (Ritika Singh) ఫైన‌ల్ చేసిన‌ట్లు స‌మాచారం. హైద‌రాబాద్‌లో వేసిన స్పెష‌ల్ సెట్‌లో చిరంజీవి, రితికా సింగ్‌పై గ్రాండ్‌గా ఈ పాట‌ను చిత్రీక‌రించారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ ఈ పాట‌కు కొరియోగ్ర‌ఫీ అందించారు. శ‌నివారం నాటితో స్పెష‌ల్ సాంగ్ షూటింగ్ పూర్త‌య్యింది. ఈ పాట‌కు చిరంజీవి, రితికా సింగ్ మాస్‌ స్టెప్పులు హైలైట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

రెండేళ్ల త‌ర్వాత‌...

కాకా ఐటెంసాంగ్‌తో రెండేళ్ల త‌ర్వాత సిల్వ‌ర్‌స్క్రీన్‌పై క‌నిపించ‌బోతుంది రితికా సింగ్‌. మాధ‌వ‌న్ హీరోగా సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఇరుదు సుట్రు సినిమాతో రితికా సింగ్ యాక్టింగ్ కెరీర్ మొద‌లైంది. తొలి సినిమాతోనే నేష‌న‌ల్ అవార్డ్ రావ‌డంతో టాప్ హీరోయిన్ అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఇరుదు సుట్రుకు రీమేక్‌గా వ‌చ్చిన వెంక‌టేష్ గురుతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత నీవెవ‌రో, శివ‌లింగ‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది. ప‌రాజ‌యాల కార‌ణంగా గ‌త రెండేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటోంది. కాకాతో మ‌ళ్లీ టాలీవుడ్‌లో బిజీ కావాల‌ని ఆశ‌ప‌డుతోంది రితికా సింగ్‌.

 

Advertisement
Advertisement