Tollywood | హీరోయిన్‌గా మారిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ – ప్రభుత్వంపై క్వీన్ పోరాటం
ఫోక్ సాంగ్స్‌తో ఫేమస్ అయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ యామినీ ఈఆర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. క్వీన్ పేరుతో ఓ ఫిమేల్ సెంట్రిక్ మూవీ చేస్తోంది. యామినీ ఈఆర్ బర్త్ డే సందర్భంగా క్వీన్ నుంచి ఆదివారం మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
Entertainment | Published On Apr 12, 2026, 12.37 pm IST
Tollywood | ఫోక్ సాంగ్స్‌తో ఫేమస్ అయ్యింది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ యామినీ ఈఆర్. గంగాధరి ఇంటికాడ, రామసక్కని పిల్లోడేతో పాటు యామినీ నటించిన పలు ఫోక్ సాంగ్స్ పెద్ద హిట్టయ్యాయి. ఈ పాటల ద్వారా వచ్చిన గుర్తింపుతో కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌తో పాటు సినిమాలు చేసింది. తాజాగా యామినీ ఈఆర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. ఈ సినిమాకు క్వీన్ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు.
క్లాసికల్ డ్యాన్సర్‌గా...
యామినీ ఈఆర్ బర్త్‌డే సందర్భంగా ఆదివారం క్వీన్ మూవీ నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో క్లాసికల్ డ్యాన్సర్ గెటప్‌లో యామినీ కనిపించింది. రిప్ డెమక్రసీ అంటూ పోస్టర్‌పై ఉన్న అక్షరాలు ఆసక్తిని పంచుతోన్నాయి. ప్రేమకథకు ప్రస్తతం సొసైటీని పట్టిపీడిస్తున్న సమకాలీన సమస్యను జోడించి క్వీన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాను ప్రాణంగా ప్రేమించి యువకుడి కలను నిజం చేయడానికి ఓ యువతి ఏం చేసింది... అతడి కలకు చట్టబద్దమైన గుర్తింపు తీసుకురావాలని అనుకున్న ఆమెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నది ఎమోషనల్‌గా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం క్వీన్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అలనాటి హీరో...
కాగా ఈ సినిమాలో యామినీ తండ్రిగా అలనాటి హీరో కనిపించబోతున్నారు. అతడు ఎవరన్నది త్వరలోనే మేకర్స్ రివీల్ చేయబోతున్నారు. కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



