Yami Gautam | బాలీవుడ్‌ను వదిలిపెట్టాలని చాలా సార్లు అనుకున్నా – ధురంధర్ 2 డైరెక్టర్ భార్య కామెంట్స్
బాలీవుడ్‌లోని వివక్షపై ధురంధర్ 2 డైరెక్టర్ భార్య బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. సెట్స్‌లో తనను చాలా చులకనగా చూస్తూ అవమానించేవారని అన్నది. పైకి కనిపించే మెరుపులకు..ఇండస్ట్రీలోకి ఉండే వాస్తవ పరిస్థితులకు అస్సలు సంబంధం ఉండదని యామీ గౌతమ్ చెప్పింది.
Entertainment | Published On Mar 24, 2026, 2.58 pm IST
Yami Gautam | బాలీవుడ్‌లో తనకు ఎదురైన అవమానాలు, విమర్శలపై ధురంధర్ 2 డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య, బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లోని వివక్ష కారణంగా చాలా సార్లు ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్లిపోవాలని అనుకున్నానని అన్నది. భర్త సపోర్ట్‌తోనే ఆ అవమానాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నానని చెప్పింది.
చూపులతోనే...
"బాలీవుడ్‌లో నేను చాలా సార్లు వివక్షను ఎదుర్కొన్నా. సెట్స్‌లో నా గురించి నాముందే చులకనగా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇతర హీరోయిన్లను గౌరవిస్తూ నన్ను మాత్రం తక్కువగా చూసేశారు. అదేమని అడగాలని అనిపించేది. కానీ గౌరవాన్ని అందుకునే స్థాయికి నీకు ఇంకా రాలేదు అన్నట్టుగా నావైపుగా చూసేవారు. వారి చూపులతోనే భావమేమిటో అర్థమయ్యేది" అని యామీ గౌతమ్ అన్నది.
ఒంటరిగా ఫీలయ్యేదానిని...
"సెట్స్‌లో చుట్టూ అందరూ ఉన్నా ఒంటరిగానే ఫీలైన సందర్భాలు ఉన్నాయి. పరాయి వ్యక్తిలా భావించేవారు. నా అవసరం లేకుండా నన్ను ఎందుకు హీరోయిన్‌గా తమ సినిమాల్లో తీసుకున్నారో అంతు పట్టేది కాదు. బాలీవుడ్‌లో ఉంటూ తప్పు చేస్తున్నానని బాధపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మనసుకు అయిన గాయాలు లెక్కేలేవు. హీరోయిన్‌గా నేనే ఫైనల్ అని చెప్పేవారు. అంత ఒకే అనుకునే లోపు నన్ను కాదని అవకాశాలు మరొకరికి దక్కేవి. అందుకు కారణాలేమిటో కూడా చెప్పేవారు కాదని అన్నది. పైకి కనిపించే బాలీవుడ్‌కు ఇండస్ట్రీలోని వాస్తవ పరిస్థితులకు అసలు పొంతనే ఉండదని" యామీ గౌతమ్ అన్నది.
ఇంట్రోవర్ట్...
"ఇతరులతో నేను అంత త్వరగా కలవలేను. భర్త ఆదిత్య నాకంటే చాలా పెద్ద ఇంట్రోవర్ట్. ఆదిత్య నా లైఫ్‌లోకి వచ్చిన తర్వాత నా ఆలోచణ ధోరణి మారిపోయింది. కష్టమే ఏదో ఒక రోజు మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని నాలో ధైర్యాన్ని నింపారు" అని యామీ గౌతమ్ పేర్కొన్నది.
ఉరి మూవీతో...
ఆదిధ్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఉరి మూవీ యామీ గౌతమ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమానే ఆమెలోని నటనాప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చింది. ఉరి సినిమా సమయంలోనే ఆదిత్య ధర్‌తో ప్రేమలో పడింది యామీ గౌతమ్. ఈ సినిమా రిలీజైన తర్వాత ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు.భర్త ఆదిత్య ధర్ లేటెస్ట్ మూవీ ధురంధర్ 2లో యామీ గౌతమ్ గెస్ట్ రోల్‌లో కనిపించింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



