త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arijit Singh | ఇండియాలోనే రిచెస్ట్ సింగర్ – ఒక్కో పాట‌కు ఆర్జిత్ సింగ్ ఎంత రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటాడంటే?

సింగింగ్ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించి మ్యూజిక్ ల‌వ‌ర్స్‌కు షాకిచ్చాడు ఆర్జిత్ సింగ్‌. ప్ర‌స్తుతం ఇండియాలోనే రిచెస్ట్ సింగ‌ర్స్‌లో ఒక‌రిగా ఆర్జిత్ సింగ్ కొన‌సాగుతోన్నాడు. అత‌డి మొత్తం ఆస్తుల విలువ 414 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ట‌.

N

Entertainment | Published On Jan 28, 2026, 6.36 pm IST

Arijit Singh | ఇండియాలోనే రిచెస్ట్ సింగర్ – ఒక్కో పాట‌కు ఆర్జిత్ సింగ్ ఎంత రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటాడంటే?
Advertisement

Arijit Singh |  సింగింగ్ కెరీర్ హ‌ఠాత్తుగా రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించి మ్యూజిక్ ల‌వ‌ర్స్‌కు షాకిచ్చాడు ఆర్జిత్ సింగ్‌. ప్ర‌స్తుతం అంగీక‌రించిన సినిమాలు మిన‌హా కొత్త‌వేవీ ఒప్పుకోన‌ని ప్ర‌క‌టించాడు. కెరీర్ పీక్స్‌లో ఉన్న త‌రుణంలో ఆర్జిత్ సింగ్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం మ్యూజిక్ ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌రంగా మారింది. రిటైర్‌మెంట్ వెన‌కున్న కార‌ణాల‌ను రివీల్ చేశాడు. ఒకే ర‌క‌మైన పాట‌లు పాడ‌టం త‌న‌కు ఇష్టం లేద‌ని, కొత్త‌గా ఏదైనా చేయాల‌నే త‌ప‌న‌తోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆర్జిత్ సింగ్ వెల్ల‌డించాడు.

కొత్త సింగ‌ర్స్‌కు...

సినిమాల‌కు దూర‌మైన త‌న సంగీత ప్ర‌యాణం మాత్రం ఆగ‌ద‌ని, క్లాసిక‌ల్ మ్యూజిక్ నేర్చుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పాడు. కొత్త సింగ‌ర్స్ ఇండ‌స్ట్రీలోకి అవ‌కాశాలు ద‌క్కాల‌ని, వారి ప్ర‌తిభ‌ను ప్రోత్సాహించాల‌నే తాను సినిమాల నుంచి త‌ప్పుకోవాల‌ని నిశ్చ‌యించుకున్న‌ట్లు ఆర్జిత్ సింగ్ పేర్కొన్నాడు. అత‌డి నిర్ణ‌యంతో మ్యూజిక్ ల‌వ‌ర్స్ డిస‌పాయింట్ అయ్యారు.

వెయ్యికిపైగా పాట‌లు...

ప‌దిహేనేళ్ల సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో హిందీ, తెలుగు, త‌మిళం క‌న్న‌డంతో పాటు ప‌ది భాష‌ల్లో క‌లిపి వెయ్యికికుపైగా పాట‌లు పాడారు ఆర్జిత్ సింగ్‌. ఒక్క బాలీవుడ్‌లోనే 600ల‌కుపైగా సాంగ్స్ ఆల‌పించారు. దాదాగిరి అనే టీవీ షోతో సింగ‌ర్‌గా ఆర్జిత్ సింగ్ కెరీర్ మొద‌లైంది. త‌క్కువ కాలంలోనే టాప్ సింగ‌ర్‌గా మారిపోయాడు. బెస్ట్ సింగ‌ర్‌గా బ్ర‌హ్మాస్త్ర (కేస‌రియా), ప‌ద్మావ‌త్ (బింతే దిల్‌) సినిమాల‌కు గాను రెండు నేష‌న‌ల్ అవార్డు అందుకున్నాడు. గ‌త ఏడాది ప‌ద్మ‌శ్రీ అవార్డు వ‌రించింది. స్పోటిఫై మ్యూజిక్ యాప్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా హ‌య్యెస్ట్ ఫాలోవ‌ర్స్ ఉన్న సింగ‌ర్‌గా కొన‌సాగుతోన్నాడు.

రిచెస్ట్ సింగ‌ర్‌...

ఇండియాలోనే రిచెస్ట్ సింగ‌ర్స్ లిస్ట్‌లో ఆర్జిత్ సింగ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ బాలీవుడ్ సింగ‌ర్‌ మొత్తం ఆస్తుల విలువ 414 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. సినిమాల్లో ఒక్కో పాట కోసం ఎనిమిది నుంచి ప‌ది ల‌క్ష‌ల మ‌ధ్య రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నాడు. లైవ్ కాన్సెర్ట్‌ల కోసం 14 కోట్ల వ‌ర‌కు తీసుకుంటున్నాడు. లైవ్ ప‌ర్ఫార్మెన్స్ అయితే కోటిన్న‌ర నుంచి రెండు కోట్ల ఆర్జిత్ సింగ్ వ‌సూలు చేస్తున్నాడ‌ట‌. ఇక‌పై సినిమాలు మానేసిన లైవ్ కాన్సెర్ట్‌లు మాత్రం చేస్తాన‌ని ఆర్జిత్ సింగ్ పేర్కొన్నాడు. ముంబాయిలోని వెర్సోనా ఏరియాలో ఆర్జిత్ సింగ్‌కు ల‌గ్జ‌రీ బిల్డింగ్ ఉంది. ఈ ఇళ్లు ఖ‌రీదు తొమ్మిది కోట్ల‌కుపైనే ఉంటుద‌ట‌. రేంజ్ రోవ‌ర్ వోగ్‌, హ‌మ్మ‌ర్ హెచ్ 3, మెర్సిడెజ్ బెంజ్‌తో పాటు ప‌లు ఖ‌రీదైన కార్లు ఆర్జిత్ సింగ్ వ‌ద్ద ఉన్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement