Tamil OTT | నాలుగు కోట్ల బడ్జెట్ – 36 కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి రజనీకాంత్ కూతురు రొమాంటిక్ లవ్‌స్టోరీ
రజనీకాంత్ కూతురు సౌందర్య నిర్మించిన తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ విత్ లవ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మార్చి 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 36 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
Entertainment | Published On Mar 1, 2026, 12.51 pm IST
Tamil OTT | సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య నిర్మించిన తమిళ మూవీ విత్ లవ్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ జీవంత్ హీరోగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది.
జియో హాట్‌స్టార్‌లో...
ఈ బ్లాక్‌బస్టర్ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. మార్చి 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
నాలుగు కోట్ల బడ్జెట్...
విత్ లవ్ మూవీకి మదన్ దర్శకత్వం వహించాడు. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్‌తో చిన్న సినిమాగా రూపొందిన ఈ మూవీ 36 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్లలో తమిళంతో పాటు తెలుగులోనూ అదే పేరుతో విత్ లవ్ రిలీజైంది. కోలీవుడ్‌లో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ తెలుగు ఆడియెన్స్‌ను మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. ఈ తమిళ మూవీలో టూరిస్ట్ ఫ్యామిలీ హీరో శశికుమార్ గెస్ట్ రోల్‌లో కనిపించాడు.
సత్య, మనీషా లవ్ జర్నీ...
సత్య (అభిషన్ జీవంత్)ఓ ఆర్కిటెక్చర్. బ్రేకప్ కారణంగా ప్రేమ, పెళ్లి లాంటి బంధాల పట్ల నమ్మకం కోల్పోతాడు. కుటుంబసభ్యులు చూసిన సంబంధాలన్నీ రిజెక్ట్ చేస్తుంటాడు. అక్క బలవంతం మేరకు మనీషా (అనస్వర రాజన్) అనే అమ్మాయిని పెళ్లిచూపులు చూడటానికి వెళతాడు సత్య. ఆ పెళ్లి చూపుల్లోనే మనీషా...స్కూల్‌లో తనకంటే రెండేళ్లు జూనియర్ అనే సంగతి సత్యకు తెలుస్తుంది. ఇద్దరూ స్కూల్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు. ఈ క్రమంలో స్కూల్ డేస్‌లో అనీషా అనే అమ్మాయిని ప్రేమించిన సంగతి బయటపెడతాడు సత్య. మనీషా కూడా బాలాజీని ఇష్టపడుతుంది. కానీ ఇద్దరి ప్రేమకథలకు బ్రేకప్ పడుతుంది. అందుకు కారణమేమిటి? తమ మాజీ ప్రేమికులను కలవాలని సత్య, మనీషా ఎందుకు అనుకున్నారు. ఆ తర్వాత ఏమైంది?అన్నదే ఈ మూవీ కథ.వెళైయిల్లా పట్టాధారి 2 తర్వాత సినిమాలకు దాదాపు తొమ్మిదేళ్ల పాటు దూరమైన సౌందర్య రజనీకాంత్ ఈ మూవీతోనే రీఎంట్రీ ఇచ్చింది.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Tripti Dimri | మాధురీ దీక్షిత్ కూతురిగా త్రిప్తి డిమ్రి – బాలీవుడ్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సాంగ్
మే 15, 2026

Dhurandhar 2 | మరింత ఆలస్యంగా ఓటీటీలోకి ధురంధర్ 2 – రామ్‌చరణ్ సినిమాకు పోటీగా రిలీజ్
మే 15, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



