త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deepika Padukone | ర‌ష్మిక మంద‌న్న సినిమాలో దీపికా ప‌దుకొనే – బోల్డ్ రోల్‌తో స‌ర్‌ప్రైజ్‌

ర‌ష్మిక మంద‌న్న, కృతిస‌న‌న్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న రొమాంటిక్ మూవీ కాక్‌టెయిల్ 2 జూన్ 19న రిలీజ్ కాబోతుంది. ఈ బాలీవుడ్ మూవీలో దీపికా ప‌దుకొనే గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

N

Entertainment | Published On Apr 25, 2026, 4.49 pm IST

Deepika Padukone | ర‌ష్మిక మంద‌న్న సినిమాలో  దీపికా ప‌దుకొనే – బోల్డ్ రోల్‌తో స‌ర్‌ప్రైజ్‌
Advertisement

Deepika Padukone |  ప్ర‌స్తుతం అల్లు అర్జున్ రాకాతో పాటు షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది దీపికా ప‌దుకొనే. కింగ్ మూవీ ఈ ఏడాది చివ‌ర‌లో థియేట‌ర్ల‌లోకి రాబోతుండ‌గా.....అల్లు అర్జున్ రాకా వ‌చ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇటీవ‌లే తాను త‌ల్లి కాబోతున్న‌ట్లు దీపికా ప‌దుకొనే ప్ర‌క‌టించింది. ప్రెగ్నెన్సీ కార‌ణంగా ఈ రెండు సినిమాల్లో దీపిక పాత్ర‌ల్లో చాలానే మార్పులు చేశార‌ట‌. లెంగ్త్ త‌గ్గించ‌డ‌మే కాకుండా ఆమె క్యారెక్ట‌ర్ తాలూకు షూటింగ్‌ను త్వ‌ర‌గా కంప్లీట్ చేయాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

గెస్ట్ రోల్‌...

రాకా, కింగ్‌తో పాటు తాజాగా దీపికా ప‌దుకొనే మ‌రో బాలీవుడ్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అయితే హీరోయిన్‌గా కాదు. జూన్‌లో రిలీజ్ కాబోతున్న ఓ క్రేజీ మూవీలో గెస్ట్ రోల్‌లో న‌టిస్తున్న‌ట్లు తెలిసింది.
షాహిద్ క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న‌, కృతి స‌న‌న్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న‌ బాలీవుడ్ రొమాంటిక్ మూవీ కాక్ టెయిల్ 2 జూన్ 19న విడుద‌ల కాబోతుంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఫ‌స్ట్ సింగిల్‌తో పాటు పోస్ట‌ర్ల‌తో బాలీవుడ్‌లో కాక్ టెయిల్ 2 టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఈ పోస్ట‌ర్ల‌లో ర‌ష్మిక‌, కృతిస‌న‌న్ మెతాదుకు మించి అందాల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమాలో వీరిద్ద‌రు లెస్బియ‌న్స్‌గా న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

వెరోనికా...

కాగా కాక్ టెయిల్ 2లో దీపికా ప‌దుకొనే అతిథి పాత్ర‌లో త‌ళుక్కున మెర‌వ‌బోతున్న‌ట్లు బాలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. కాక్‌టెయిల్ మూవీకి సీక్వెల్‌గా కాక్ టెయిల్ 2 తెర‌కెక్కుతోంది. కాక్‌టెయిల్ లో దీపికా హీరోయిన్‌గా న‌టించింది. వెరోనికా అనే బోల్డ్ రోల్ చేసింది. దీపికా క్యారెక్ట‌రైజేష‌న్‌, ఆమె డైలాగ్స్ పై అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. వెరోనికా క్యారెక్ట‌ర్‌లోనే కాక్ టెయిల్ 2లో దీపికా క‌నిపించ‌బోతుంద‌ట‌. క్యారెక్ట‌ర్ నిడివి త‌క్కువే అయినా క‌థ‌లో కీల‌కంగా ఉంటుంద‌ని అంటున్నారు. ఆడియెన్స్ కూడా స‌ర్‌ప్రైజ్‌లా ఫీల‌య్యేలా ద‌ర్శ‌కుడు దీపికా పాత్ర‌ను కొత్త‌గా డిజైన్ చేసిన‌ట్లు చెబుతోన్నారు.
పెళ్లి త‌ర్వాత రిలీజ్ అవుతోన్న ర‌ష్మిక మంద‌న్న ఫ‌స్ట్ మూవీ కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. కెరీర్‌లోనే మోస్ట్ గ్లామ‌ర‌స్ రోల్‌ను ఈ సినిమాలోనే ర‌ష్మిక చేసిన‌ట్లు చెబుతోన్నారు. కాక్ టెయిల్ 2 మూవీకి హోమీ అద్జానియా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మాడోక్ ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Advertisement
Advertisement