Rukmini Vasanth | రుక్మిణి వసంత్‌ను అన్‌ఫాలో చేసిన కాంతార హీరో – విభేదాలే కారణమా?
హీరోయిన్ రుక్మిణి వసంత్‌ను కాంతార హీరో రిషబ్ శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం ఆసక్తికరంగా మారింది. రుక్మిణి వసంత్‌తో పాటు మరో కన్నడ నటుడు రాజ్ బీ శెట్టి, కాంతార నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌లను రిషబ్ శెట్టి ఆన్‌ఫాలో చేశారు. విబేధాల కారణంగానే రిషబ్ శెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోన్నారు.
Entertainment | Published On Mar 28, 2026, 4.16 pm IST
Rukmini Vasanth | కాంతార సినిమాలతో దక్షిణాది ఆడియెన్స్‌కు చేరువయ్యారు రిషబ్ శెట్టి. అతడు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కాంతార, కాంతార ఛాప్టర్ వన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. కన్నడంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాలుగా రికార్డ్ నెలకొల్పాయి. తెలుగులోనూ మంచి వసూళ్లను దక్కించుకున్నాయి.
తాజాగా కాంతార ఛాప్టర్ వన్‌కు సీక్వెల్‌గా కాంతార ఛాప్టర్ 2ను తెరకెక్కించబోతున్నట్లు రిషబ్ శెట్టి ప్రకటించారు. ఈ సీక్వెల్ సెట్స్‌పైకి రాకముందే హీరోకు, నిర్మాణ సంస్థకు మధ్య అభిప్రాయభేదాలు మొదలైనట్లు కన్నడ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
అన్‌ఫాలో....
ఇటీవలే కాంతార ఛాప్టర్ వన్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఖాతాను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారు రిషబ్ శెట్టి. తాజాగా ఈ మూవీలో హీరోయిన్‌గా నటించిన రుక్మిణి వసంత్‌తో పాటు మరో కన్నడ హీరో రాజ్ బీ శెట్టిలను అన్‌ఫాలో చేయడం కన్నడనాట ఆసక్తికరంగా మారింది.
లాభాల్లో వాటా...
కాంతార ఛాప్టర్ వన్ లాభాల్లో వాటా విషయంలో చిత్ర నిర్మాతలకు, రిషబ్ శెట్టికి మధ్య గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తోందని అంటున్నారు. కాంతార ఛాప్టర్ వన్ మూవీకి హీరో, డైరెక్టర్ కమ్ రైటర్‌గా వ్యవహరించినందుకు వంద కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి హోంబలే ఫిల్మ్స్ అంగీకరించిదట. యాభై కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చారట. సినిమా రిలీజైన తర్వాత మిగిలిన రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్లో వాటా కూడా ఇస్తామని మాట ఇచ్చినట్లు సమాచారం. కానీ ఆ హామీని హోంబలే ఫిల్మ్స్ నిలబెట్టుకోలేకపోయినట్లు చెబుతోన్నారు. సినిమాకు 900 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. కానీ రిషబ్ శెట్టికి మాత్రం బ్యాలెన్స్ రెమ్యూనరేషన్ మాత్రమే చెల్లించినట్లు సమాచారం. ప్రాఫిట్ షేరింగ్స్‌కు సంబంధించి మాట మార్చేసినట్లు టాక్ వినిపిస్తోంది. నిర్మాతల తీరుతో అసంతృప్తికి లోనైన రిషబ్ శెట్టి హోంబలే ఫిల్మ్స్‌ను అన్‌ఫాలో చేసినట్లు సమాచారం.
మరో బ్యానర్‌లో...
కాంతార ఛాప్టర్ 2 మూవీని హోంబలే బ్యానర్‌లో కాకుండా మరో నిర్మాణ సంస్థతో చేయబోతున్నట్లు సమాచారం. కానీ రుక్మిణి వసంత్, రాజ్ బీ శెట్టిలను అన్‌ఫాలో చేయడానికి గల కారణమేమిటన్నది మాత్రం తెలియరాలేదు. రిషబ్ శెట్టికి సన్నిహితుడిగా రాజ్ బీ శెట్టిని చెబుతున్నారు. గరుడ గమన వృషభ వాహనతో పాటు మరికొన్ని సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. సడెన్‌గా రాజ్ బీ శెట్టిని రిషబ్ శెట్టి ఎందుకు దూరం పెట్టాడన్నది అభిమానులకు అంతు పట్టడం లేదు. రిషబ్ శెట్టి అన్‌ఫాలోతో కాంతార ఛాప్టర్ 2లో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించకపోవచ్చునని ప్రచారం జరుగుతోంది.
జై హనుమాన్..
కాంతార ఛాప్టర్ వన్ తర్వాత తెలుగులో జై హనుమాన్ సినిమా చేయబోతున్నారు రిషబ్ శెట్టి. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛ్ అయ్యింది. ఈ పాన్ ఇండియన్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
సంబంధిత వార్తలు

Instagram Instants | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఇన్స్టంట్స్ ఫీచర్.. ఫోటోలు చూసిన వెంటనే మాయం..
మే 14, 2026

Mouni Roy | విడాకుల దిశగా యంగ్ హీరోయిన్ – భర్తను అన్‌ఫాలో చేసిన విశ్వంభర బ్యూటీ
మే 12, 2026

Instagram | సెలబ్రిటీలకు షాకిచ్చిన ఇన్స్టాగ్రామ్.. భారీగా ఫేక్ ఫాలోవర్ల తొలగింపు..
మే 7, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



