OTT | ఓటీటీలోకి రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి – రిలీజ్ మరింత ఆలస్యం
రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీలోకి రావడం ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ వారం ఓటీటీలోకి రావాల్సిన రవితేజ మూవీ మన శంకర వరప్రసాద్‌గారు, అనగనగా ఒక రాజులతో పోటీ కారణంగా మరో వారం తర్వాతే జీ5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు.
Entertainment | Published On Feb 12, 2026, 4.21 pm IST
OTT | రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీలోకి రావడం ఆలస్యం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఈ వారమే ఓటీటీలోకి రావాల్సింది. కానీ చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారుతో పాటు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలు బుధవారం ఓటీటీలో విదుదలయ్యాయి. వాటికి పోటీగా రిలీజ్ చేస్తే వ్యూయర్‌షిప్ తగ్గే అవకాశం ఉండటంతో వారం ఆలస్యంగా ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఫిబ్రవరి 20 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇద్దరు హీరోయిన్లు...
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. ఇందులో రవితేజకు జోడీగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. భార్యకు ప్రియురాలికి మధ్య నలిగిపోయే ఓ వ్యక్తి కథతో కామెడీకి ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సినిమాను తెరకెక్కించారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి కోసం రవితేజ తన మాస్ మహారాజా ట్యాగ్‌ను పక్కనపెట్టాడు. . అంతే కాకుండా రెమ్యూనరేషన్ లేకుండా ప్రాఫిట్స్‌లో పర్సంటేజ్ తీసుకునే విధానంలో ఈ సినిమా చేశాడు. అయినా అతడికి హిట్టు మాత్రం దక్కలేదు.
57 శాతం రికవరీ...
దాదాపు నలభై కోట్ల బడ్జెట్‌త్‌తో రూపొందిన ఈ మూవీ 22 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్స్ రాబట్టింది. 57 శాతమే రికవరీ సాధించి నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో సునీల్, వెన్నెలకిషోర్, సత్య కీలక పాత్రల్లో కనిపించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.
రామ్ సీక్రెట్ లవ్‌స్టోరీ...
రామసత్యనారాయణ అలియాస్ రామ్‌కు (రవితేజ)...తన భార్య బాలామణితో (డింపుల్ హయతి)కలిసి వైన్ ఫ్యాక్టరీ రన్ చేస్తుంటాడు. స్పెయిన్‌కు చెందిన మానసశెట్టితో డీల్ కుదుర్చుకొని తన వైన్ బ్రాండ్‌ను డెవలప్ చేయాలనుకుంటాడు రామ్. ఆ డీల్‌ను సెట్ చేసుకునే క్రమంలో తనకు పెళ్లయిందనే నిజాన్ని దాచిపెట్టి మానస శెట్టికి దగ్గరవుతాడు. మరోవైపు భర్త రామ్‌ను మగాళ్లకు రోల్ మోడల్‌గా భావిస్తుంటుంది అతడి భార్య బాలామణి. కన్నెత్తి కూడా పరాయి ఆడవాళ్లను చూడడని గొప్పగా చెబుతుంటుంది. మానస శెట్టి పరిచయం తర్వాత రామ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? మానసతో రిలేషన్ గురించి బాలమణికి నిజం తెలియకుండా రామ్ ఎలాంటి అబద్దాలు ఆడాడు? రామ్‌ను వెతుక్కుంటూ మానస ఎందుకు హైదరాబాద్ వచ్చింది? అన్నదే ఈ మూవీ కథ
భర్త మహాశయులకు విజ్ఞప్తి డిజాస్టర్‌తో సంబంధం లేకుండా రవితేజ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇరుముడితో పాటు మరో మూడు సినిమాలు అంగీకరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Web Series | సలార్ రాజు మిస్సింగ్ – మెగా బ్రదర్ రీఎంట్రీ .. కామెడీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ ఎందులో..ఎప్పుడంటే?
మే 14, 2026

Dimple Hayathi | మందారం…బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ …భోగి నుంచి డింపుల్ హయతి ఫస్ట్ లుక్ అదిరిందిగా!
మే 11, 2026

Dacoit OTT | నెలరోజుల్లోనే ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ తెలుగు మూవీ
మే 3, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



