త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ravi Teja | కందిరీగ టైటిల్ – ర‌వితేజ హీరో – కృష్ణ‌వంశీ డైరెక్ట‌ర్ – సినిమా ఎందుకు ఆగిపోయిందంటే?

Ravi Teja | ర‌వితేజ హీరోగా కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో కందిరీగ (Kandireega) పేరుతో ఓ సినిమా రావాల్సింది. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా ఆగిపోయింది. ర‌వితేజ కోసం అనుకున్న కందిరీగ టైటిల్‌తోనే రామ్ సినిమా చేసి హిట్టు కొట్టాడు.

N

Entertainment | Published On Dec 19, 2025, 10.13 pm IST

Ravi Teja | కందిరీగ టైటిల్ – ర‌వితేజ హీరో – కృష్ణ‌వంశీ డైరెక్ట‌ర్ – సినిమా ఎందుకు ఆగిపోయిందంటే?

రవితేజ

Advertisement

కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సింధూరం మూవీతోనే మాస్ మ‌హారాజా ర‌వితేజ(Ravi Teja) హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తూ చిన్న చిన్న రోల్స్ చేస్తున్న ర‌వితేజ కెరీర్ సింధూరంతోనే మ‌లుపు తిరిగింది. ర‌వితేజ‌లోని యాక్టింగ్ టాలెంట్ ఈ సినిమాతోనే వెలుగులోకి వ‌చ్చింది. హీరోగానే కాకుండా విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా...ఇలా ఒక్కో అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఎదిగారు ర‌వితేజ‌.
సింధూరం త‌ర్వాత కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ఖడ్గం సినిమాలో ర‌వితేజ హీరోగా న‌టించాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ హ్యాట్రిక్ మూవీ రావాల్సింది. అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చిన త‌ర్వాత ఆ సినిమా ఆగిపోయింది.
ర‌వితేజ హీరోగా కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో కందిరీగ పేరుతో ఓ సినిమాను నిర్మించాల‌ని అనుకున్నారు నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్‌. టైటిల్ కూడా రిజిస్ట‌ర్ చేయించారు. ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్‌ను కూడా భారీగా నిర్వ‌హించారు.

శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌ల ముని మ‌న‌వ‌డిగా

సోషియో ఫాంట‌సీ క‌థాంశంతో కందిరీగ క‌థ‌ను సిద్ధం చేశారు. ఇందులో శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌ల ముని మ‌న‌వ‌డిగా ర‌వితేజ క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌ల కాలానికి నేటి టైమ్ పీరియ‌డ్‌ను ముడిపెట్టి ఈ సినిమాను తెర‌కెక్కించాల‌ని కృష్ణ‌వంశీ అనుకున్నారు.
ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో ర‌వితేజ‌కు జోడీగా త‌మ‌న్నాతో పాటు స్నేహా ఉల్లాల్‌ను హీరోయిన్లుగా ఫిక్స్ కూడా చేశారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తిచేసుకొని ఇక షూటింగ్ మొద‌లుపెట్ట‌డ‌మే త‌రువాయి అనే టైమ్‌లో సినిమా ఆగిపోయింది. ప్రొడ్యూస‌ర్‌తో వ‌చ్చిన క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌ల్లే కందిరీగ సినిమా నుంచి ర‌వితేజ త‌ప్పుకున్న‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. అలా ర‌వితేజ - కృష్ణ‌వంశీ కాంబోలో హ్యాట్రిక్ మూవీ షూటింగ్ వ‌ర‌కు వ‌చ్చి ఆగిపోయింది.
ర‌వితేజ సినిమా కోసం అనుకున్న కందిరీగ టైటిల్‌తో రామ్ హీరోగా ఓ సినిమా వ‌చ్చింది. సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ర‌వితేజ కోసం సిద్ధం చేసిన క‌థతోనే రామ్ కందిరీగ సినిమా చేసిన‌ట్లు వార్త‌లొచ్చాయి. రామ్ కందిరీగ‌కు క‌థ‌ను అందించింది ఇప్ప‌టి టాప్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కావ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజావార్తలు

Advertisement