త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor | చెల్లిని రిజెక్ట్ చేసి అక్క‌కు ఛాన్స్ – పెద్ది హీరోయిన్ సెలెక్ష‌న్ వెనుక ఇంత పెద్ద‌ కథ ఉందా!

పెద్దిలో హీరోయిన్‌గా జాన్వీక‌పూర్ ఫ‌స్ట్ ఛాయిస్ కాద‌ట‌. జాన్వీ చెల్లెలు ఖుషి క‌పూర్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ ఖుషిని రిజెక్ట్ చేసి జాన్వీకి ఛాన్స్ ఇవ్వ‌డం వెన‌కున్న స్టోరీని పెద్ది ప్ర‌మోష‌న్స్‌లో డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా బ‌య‌ట‌పెట్టాడు.

N

Entertainment | Published On May 16, 2026, 1.09 pm IST

Janhvi Kapoor | చెల్లిని రిజెక్ట్ చేసి అక్క‌కు ఛాన్స్ – పెద్ది హీరోయిన్ సెలెక్ష‌న్ వెనుక ఇంత పెద్ద‌ కథ ఉందా!
Advertisement

Janhvi Kapoor | రామ్‌చ‌ర‌ణ్ పెద్దిలో హీరోయిన్‌గా ఫ‌స్ట్ ఛాయిస్ జాన్వీ క‌పూర్ కాద‌ట‌. హీరోయిన్ సెలెక్ష‌న్ వెన‌కున్న ట్విస్ట్‌ను పెద్ది ప్ర‌మోష‌న్స్‌లో డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా బ‌య‌ట‌పెట్టాడు. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ స్పోర్ట్స్ యాక్ష‌న్ మూవీ జూన్ 4న వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అచ్చియ‌మ్మ అనే పాత్ర‌లో ఈ బాలీవుడ్ బ్యూటీ క‌నిపించ‌బోతుంది. దేవ‌ర‌తో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీకి తెలుగులో పెద్ది సెకండ్ మూవీ.

చెల్లి రిజెక్ట్‌...

కాగా పెద్దిలో మొద‌ట జాన్వీ క‌పూర్ చెల్లెలు ఖుషి క‌పూర్‌ను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని అనుకున్నాడ‌ట బుచ్చిబాబు సానా. కానీ చెల్లిని రిజెక్ట్ చేసి అక్క‌కు హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వాల్సివ‌చ్చింద‌ని అన్నారు. "ఖుషి క‌పూర్‌ను క‌థానాయిక‌గా అనుకొని ముంబై వెళ్లి ఆమెను క‌లిశా. కానీ అచ్చియ‌మ్మ రోల్‌కు ఆమె ఏజ్ మ్యాచ్ కాద‌నిపించింది. దాంతో ఖుషిని రిజెక్ట్ చేసి అదే ఇంట్లో జాన్వీకి క‌థ చెప్పా. చెల్లిని వ‌ద్ద‌ని ఆమె ముందే అక్క‌కు క‌థ చెప్ప‌డం చాలా క‌ష్ట‌మే అయ్యింది. బాధ‌గా కూడా అనిపించింది. కానీ సినిమా కోసం త‌ప్ప‌లేదు. ఖుషి ఏం అనుకోవ‌డం లేదు క‌దా అని జాన్వీని అడిగా. నా స‌మ‌స్య‌ను ఆమెకు వివ‌రించా. ఇద్ద‌రూ అర్థం చేసుకున్నారు" అని బుచ్చిబాబు సానా చెప్పాడు. జాన్వీ కార‌ణంగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చే అవ‌కాశాన్ని ఖుషి క‌పూర్ కోల్పోయింది. నెటిజ‌న్లు మాత్రం జాన్వీ క‌పూర్ కంటే ఖుషినే బాగుంటుంద‌ని కామెంట్లు పెడుతోన్నారు.

బాలీవుడ్‌లో...

ది ఆర్చీస్ వెబ్ సిరీస్‌తో యాక్ట‌ర్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఖుషి క‌పూర్‌. ల‌వ్‌యాప‌, నాద‌నియాన్ సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం మామ్ 2లో న‌టిస్తోంది. మ‌రోవైపు జాన్వీక‌పూర్ బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాదిలో వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంటూ బిజీగా ఉంది.

 

Advertisement
Advertisement