త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి వెంక‌టేష్‌, త్రివిక్ర‌మ్ మూవీ – మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వంద కోట్ల లాట‌రీ త‌గిలితే!

వెంక‌టేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఆద‌ర్శ కుటుంబం మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి వ‌స్తోంది. న‌వంబ‌ర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఆద‌ర్శ కుటుంబం సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. నివేథా పేతురాజ్‌, నారా రోహిత్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

N

Entertainment | Published On Nov 22, 2026, 5.51 pm IST

Telugu OTT | ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి వెంక‌టేష్‌, త్రివిక్ర‌మ్ మూవీ – మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వంద కోట్ల లాట‌రీ త‌గిలితే!
Advertisement

Telugu OTT | వెంక‌టేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఆద‌ర్శ కుటుంబం భారీ అంచ‌నాల న‌డుమ థియేట‌ర్ల‌లో రిలీజై డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. నివేదా పేతురాజ్‌, నారా రోహిత్, యువీనా పార్థ‌వి కీల‌క పాత్ర‌లు పోషించారు. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు.

ఇర‌వై రోజ‌ల్లోనే....

ఆద‌ర్శ కుటుంబం థియేట‌ర్ల‌లో రిలీజైన‌ ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. న‌వంబ‌ర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు మ‌రో నాలుగు భాష‌ల్లో విడుద‌ల అవుతోంది. స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది.

అర‌వై కోట్ల బ‌డ్జెట్‌....

దాదాపు అర‌వై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఆద‌ర్శ కుటుంబం థియేట‌ర్ల‌లో యాభై కోట్ల లోపే క‌లెక్ష‌న్ల‌ను ద‌క్కించుకుంది. నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌నుతెచ్చిపెట్టింది. త్రివిక్ర‌మ్ రాసిన క‌థ‌తో పాటు అత‌డి డైరెక్ష‌న్‌పై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. త‌న పంథాకు భిన్నంగా ఫ‌స్ట్ టైమ్ క్రైమ్ క‌థ‌తో త్రివిక్ర‌మ్ ఈ సినిమా చేశారు. జాన‌ర్ మార్చినా విజ‌యం మాత్రం ద‌క్క‌లేదు.

చిట్టిబాబు క‌థ‌...

చిట్టిబాబుది మిడిల్ క్లాస్‌. బ్యాంకులో ప‌నిచేస్తుంటాడు. భార్య స్వ‌ర్ణ చేసే అప్పుల కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతుంటాడు. అనుకోకుండా చిట్టిబాబుకు వంద కోట్ల లాట‌రీ త‌గులుతుంది. వ‌చ్చిన డ‌బ్బుతో గేటెడ్ క‌మ్యూనిటీలో విల్లా కొంటాడు. బీహార్‌కు చెందిన దోపీడి ముఠా క‌న్ను చిట్టిబాబు ఇంటిపై ప‌డుతుంది. ఇంటిని దోచేయ‌ల‌ని ప్లాన్ చేస్తారు. దోపీడికి అడ్డొస్తే చిట్టిబాబుతో పాటు అత‌డి కుటుంబం మొత్తాన్ని చంపేయాల‌ని అనుకుంటారు. దోపిడీ ముఠాకు చిట్టిబాబు కుటుంబం పెద్ద షాకిస్తుంది? అదేమిటి? వారి గ‌తం గురించి దొంగ‌ల‌క‌కు ఎలాంటి షాకింగ్ నిజం తెలిసింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ఫ‌స్ట్ మూవీ....

వెంక‌టేష్ హీరోగా త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన తొలి సినిమా ఇది. గ‌తంలో వెంక‌టేష్ వాసు, నువ్వు నాకు న‌చ్చావ్‌, మ‌ల్లీశ్వ‌రి సినిమాల‌కు త్రివిక్ర‌మ్ రైట‌ర్‌గా ప‌నిచేశారు. ఆద‌ర్శ కుటుంబం సినిమాకు రాధాకృష్ణ నిర్మించారు.

 

 

 

Advertisement
Advertisement