త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fazil | ఫ‌హాద్ ఫాజిల్ తండ్రి డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఒకే ఒక తెలుగు మూవీ – నాగార్జున హీరో – బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌

హీరో ఫ‌హాద్ ఫాజిల్ తండ్రి ఫాజిల్‌ మ‌ల‌యాళంలో అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్ వంటి స్టార్స్‌కు ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇచ్చారు. తెలుగులో ఆయ‌న ద‌ర్శ‌కుడిగా ఓ సినిమా చేశారు. బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఆ మూవీ ఏదంటే?

N

Entertainment | Published On Mar 15, 2026, 8.33 pm IST

Fazil | ఫ‌హాద్ ఫాజిల్ తండ్రి డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఒకే ఒక తెలుగు మూవీ – నాగార్జున హీరో – బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌
Advertisement

Fazil | అల్లు అర్జున్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ పుష్ప 2లో విల‌న్‌గా న‌టించాడు మ‌ల‌యాళ వెర్స‌టైల్ యాక్ట‌ర్ ఫ‌హాద్ ఫాజిల్‌. ఈ సినిమాలో భ‌న్వ‌ర్‌సింగ్ షెకావ‌త్ అనే పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కామెడీ, విల‌నిజం క‌ల‌గ‌లిసిన క్యారెక్ట‌ర్‌లో విల‌క్ష‌ణ న‌ట‌న‌తో మెప్పించాడు. ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా న‌టించిన ప‌లు త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాలు తెలుగులోకి అనువాద‌మై ఆడియెన్స్‌ మెప్పించాయి.

డైరెక్ట‌ర్‌గా...

ఫ‌హాద్ ఫాజిల్ కంటే ముందు ఆయ‌న తండ్రి ఫాజిల్‌ కూడా తెలుగులో ఓ సినిమా చేశారు. అయితే న‌టుడిగా కాదు. డైరెక్ట‌ర్‌గా. మ్యూజిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. మ‌ల‌యాళంలో 1990, 2000 ద‌శ‌కంలో టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రిగా కొన‌సాగారు ఫాజిల్‌. మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టి వంటి అగ్ర హీరోల‌కు ఎన్నో హిట్లు ఇచ్చారు.

నాగార్జున హీరోగా...

ఫాజిల్ టేకింగ్‌, మేకింగ్ స్టైల్‌కు ఇంప్రెస్ అయిన టాలీవుడ్ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ వీబీ రాజేంద్ర‌ప్ర‌సాద్ ఆయ‌నతో ఓ తెలుగు సినిమా చేయాల‌ని ప్లాన్ చేశారు. ఫాజిల్‌ను అప్రోచ్ అయ్యారు. త‌న ద‌గ్గ‌ర ఉన్న ఓ క‌థ‌ను వీబీ రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు చెప్పారు ఫాజిల్. క‌థ న‌చ్చ‌డంతో నిర్మాత వెంట‌నే ఆ సినిమాకు ఓకే చెప్పారు. అదే కిల్ల‌ర్ మూవీ. ఈ సినిమాలో హీరో పాత్ర గ్రే షేడ్స్‌తో సాగుతుంది. శివ‌తో నాగార్జున‌కు వ‌చ్చిన ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆయ‌న్ని క‌థానాయ‌కుడిగా ఎంచుకున్నారు. న‌గ్మా హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో సీనియ‌ర్ న‌టి శార‌ద కీల‌క పాత్ర‌ను పోషించింది.

రికార్డులు...

1992లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా విజ‌యంలో ఇళ‌య‌రాజా పాట‌లు కీల‌క భూమిక పోషించాయి. ప్రియా ప్రియ‌త‌మా రాగాలు అనే పాట అప్ప‌ట్లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది.కిల్ల‌ర్ హిట్‌తో ఫ‌హాద్ ఫాజిల్‌తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ హీరోలు ఇంట్రెస్ట్ చూపారు. కానీ అదే టైమ్‌లో మ‌ల‌యాళంలో బిజీగా ఉండ‌టం, భాషాప‌ర‌మైన స‌మ‌స్య‌ల కార‌ణంగా తెలుగులో ఆఫ‌ర్లు వ‌చ్చినా ఫాజిల్ రిజెక్ట్ చేశారు.

Advertisement
Advertisement