Asha Bhosle | ఆశా భోస్లే లీడ్ రోల్‌లో నటించిన ఒకే ఒక సినిమా ఇదే – సచిన్ టెండూల్కర్ గెస్ట్‌గా ఆడియో రిలీజ్
సుదీర్ఘ సినీ ప్రయాణంలో యాక్టర్‌గా ఒకే ఒక సినిమా చేసింది ఆశా భోస్లే. మాయ్ పేరుతో రూపొందిన ఈ సినిమాలో అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వృద్ధురాలి పాత్రలో అసమాన నటనను కనబరిచింది. ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్‌కు సచిన్ గెస్ట్‌గా హాజరయ్యారు.
Entertainment | Published On Apr 12, 2026, 5.23 pm IST
Asha Bhosle | సింగర్‌గా ఆశా భోస్లే ఇరవైకి పైగా భాషల్లో పన్నెండు వేలకుపైగా పాటలు పాడింది. ప్రతి భాషలో తనదైన ముద్ర వేసింది. ఏ భాషలో పడిన సాహిత్య ఉచ్చరణ, గొంతులో శ్రావ్యత విషయంలో సహజత్వాన్ని కనబరిచేవారు ఆశా భోస్లే. ఆ కష్టపడేతత్వమే ఆమెను దిగ్గజ గాయనిగా నిలబెట్టింది. టాప్ సింగర్‌గా కొనసాగుతోన్న టైమ్‌లో నటిగా ఆశా భోస్లేకు చాలానే అవకాశాలు వచ్చాయట. కానీ యాక్టింగ్‌పై ఇష్టం లేకపోవడంతో ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు ఆశా భోస్లే. సుదీర్ఘ సినీ ప్రయాణంలో కేవలం ఒకే ఒక సినిమాలో మాత్రమే నటించారు. అది కూడా 79 ఏళ్ల వయసులో లీడ్ యాక్టర్‌గా కనిపించారు.
అల్జీమర్స్‌తో బాధపడే పాత్రలో...
ఆశా భోస్లే ప్రధాన పాత్రలో మాయ్ పేరుతో హిందీ, మరాఠీ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ రూపొందింది. మహేష్ కొడియాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2013లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో అల్జీమర్స్‌తో బాధపడే వృద్దురాలి పాత్రలో అసమాన నటనను కనబరిచింది. కమర్షియల్‌గా ఈ సినిమా విజయాన్ని సాధించలేకపోయినా నటిగా మాత్రం ఆశాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. మాయ్ రిలీజ్ తర్వాత ఆశాకు నటిగా ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ నటించడం తన వల్ల కాదంటూ ఈ అవకాశాలను వదలుకుంది.ఆశా భోస్లే నటించిన మొదటి...చివరి మూవీగా మాయ్ నిలిచింది.
సచిన్ టెండూల్కర్...
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో ఆశా భోస్లేకు చక్కటి అనుబంధం ఉంది. సచిన్‌ను తన కొడుకుగానే ఆశా భోస్లే భావించేది. సచిన్ క్రికెట్ మ్యాచ్‌లను ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చూసేది. సచిన్ కూడా ఆశాను అమితంగా అభిమానించేవారు. ఆ అభిమానంతోనే మాయ్ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
ఆశా భోస్లేపై అభిమానంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో అమితాబ్‌బచ్చన్, శ్రీదేవితో పాటు బాలీవుడ్ టాప్ యాక్టర్లందరూ పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



