Anu Emmanuel | అదే నేను చేసిన పెద్ద తప్పు – అను ఇమాన్యుయేల్ బోల్డ్ స్టేట్‌మెంట్
తెలుగులో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్ పది సినిమాలు చేస్తే అందులో తొమ్మిది డిజాస్టర్స్‌గా నిలిచాయి. గీతగోవిందంతో పాటు ఆమె వదులుకున్న సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ పొరపాట్లపై అను ఇమాన్యుయేల్ ఏమన్నదంటే?
Entertainment | Published On Apr 13, 2026, 5.28 pm IST
Anu Emmanuel | సాధారణంగా చాలా మంది హీరోయిన్ల కెరీర్ చిన్న సినిమాలతో మొదలవుతుంది. ఆ తర్వాతే స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్‌లు దక్కించుకుంటారు. కానీ టాలీవుడ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ సినీ ప్రయాణం మాత్రం అందుకు భిన్నంగా సాగింది. కెరీర్ ఆరంభంలోనే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోలతో పాటు నాగచైతన్య, శర్వానంద్ వంటి యంగ్ యాక్టర్స్‌తో జోడీ కట్టింది. కానీ అను ఇమ్మాన్యుయేల్‌కు అదృష్టం కలిసి రాలేదు. తెలుగులో హీరోయిన్‌గా పది సినిమాలు చేస్తే అందులో తొమ్మిది డిజాస్టర్‌గా నిలిచాయి. ఈ పరాజయాల కారణంగా టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చింది.
ది గర్ల్‌ఫ్రెండ్‌లో...
గత ఏడాది రిలీజైన రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో మరో రెండు సినిమాలు చేస్తోంది. తన కెరీర్‌లోని ఎత్తుపల్లాలపై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది అను ఇమ్మాన్యుయేల్.
పెద్ద డైరెక్టర్ల సినిమాలు..
కథ, పాత్రల విషయంలో కెరీర్ ఆరంభంలో కొన్ని తప్పటడుగులు వేసినట్లు చెప్పింది. స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్లు అని నమ్మి చేసిన సినిమాలు ఫెయిలయ్యాయని, డేట్స్ సర్ధుబాటుకాకపోవడం, చిన్న సినిమాలనే కారణాలతో తాను వదిలేసినవన్నీ హిట్టయ్యాయని అన్నది.
గీత గోవిందం....
"తెలుగులో విజయ్ దేవరకొండ గీతగోవిందంలో నేనే హీరోయిన్‌గా నటించాల్సింది. కానీ అదే టైమ్‌లో అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చేసే ఛాన్స్ వచ్చింది. రెండు ఆఫర్లు ఒకే టైమ్‌లో వచ్చాయి. డేట్స్ క్లాష్ కావడంతో గీతగోవిందం వదులుకున్నా. ఇప్పటికీ ఆ విషయంలో రిగ్రేట్‌గా ఫీలవుతున్నా. ఆ సినిమా చేసుంటే తెలుగులో నా కెరీర్ మరోలా ఉండేది. అదొక్కటే కాకుండా నేను వదులుకున్న తమిళ, మలయాళ సినిమాలు కూడా కొన్ని పెద్ద హిట్టయ్యాయి" అని ఇను ఇమాన్యుయేల్ అన్నది
దర్శకులపై నమ్మకంతో...
"అలాగే ఇండస్ట్రీలోకి నేను కొత్తగా అడుగుపెట్టడంతో చాలా మంది దర్శకులు కేవలం నా పాత్రల గురించి మాత్రమే చెప్పేవారు. టాప్ డైరెక్టర్లు కావడంతో వారిపై ఉన్న నమ్మకంతో నేను కూడా కథ మొత్తం వినకుండానే చాలా సినిమాలు చేశా. అదే నేను చేసిన పెద్ద తప్పుగా భావిస్తున్నా" అని ఇను ఇమాన్యుయేల్ చెప్పింది.
ప్రస్తుతం బూమ్‌రంగ్ పేరుతో తెలుగులో ఓ థ్రిల్లర్ సినిమా చేస్తోంది అను ఇమాన్యుయేల్. కెమెరామెన్ ఆండ్రూ ఐ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం లండన్‌లోనే సాగింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



