త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Chopra | ద‌ళ‌ప‌తి విజ‌య్ క్రేజ్ అప్పుడే తెలిసింది – డెబ్యూ మూవీ అనుభ‌వాల‌పై ప్రియాంక చోప్రా కామెంట్స్‌

త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన త‌మిళ‌న్ మూవీతోనే గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా యాక్టింగ్ జ‌ర్నీ మొద‌లైంది. ఈ సినిమాతోనే ఫ‌స్ట్ టైమ్ కెమెరా ముందుకొచ్చింది. ఈ షూటింగ్ ఎక్స్‌పీరియెన్స్‌తో పాటు ద‌ళ‌ప‌తి విజ‌య్ క్రేజ్ గురించి గ‌తంలో ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On May 11, 2026, 4.18 pm IST

Priyanka Chopra | ద‌ళ‌ప‌తి విజ‌య్ క్రేజ్ అప్పుడే తెలిసింది – డెబ్యూ మూవీ అనుభ‌వాల‌పై ప్రియాంక చోప్రా కామెంట్స్‌
Advertisement

Priyanka Chopra |  త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్‌పై గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్ర‌శంస‌లు కురిపించింది. బాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా...పాప్ సింగ‌ర్ నిక్ జోన‌స్‌ను పెళ్లి చేసుకొని హాలీవుడ్‌కు షిప్ట‌య్యింది. అక్క‌డ కూడా స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీతో...

అయితే ప్రియాంక చోప్రా యాక్టింగ్ జ‌ర్నీ మాత్రం ద‌క్షిణాది సినిమాతోనే మొద‌లైంది. ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన త‌మిళ‌న్‌ సినిమాతో మొద‌టిసారి కెమెరా ముందుకొచ్చింది ప్రియాంక చోప్రా. ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో షూటింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌పై గ‌తంలో ప్రియాంక ఓ ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.
త‌మిళ‌నాట విజ‌య్‌కి ఉన్న క్రేజ్‌, స్టార్‌డ‌మ్‌పై ప్రియాంక ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. విజ‌య్‌ని దేవుడిలా అభిమానులు ఆరాధించేవార‌ని చెప్పింది. విజ‌య్‌ని చూసేందుకు ప్ర‌తి రోజు షూటింగ్ సెట్స్‌కు వంద‌లాది మంది వ‌స్తుండేవార‌ని ప్రియాంక అన్న‌ది.

ఫ‌స్ట్ టైమ్ కెమెరా ముందుకు...

"మిస్ వ‌ర‌ల్డ్‌ టైటిల్ గెలిచిన త‌ర్వాత ఫ‌స్ట్ ఆఫ‌ర్ కోలీవుడ్ నుంచే వ‌చ్చింది. త‌మిళ‌న్ మూవీని మొద‌ట అంగీక‌రించా. అప్ప‌టివ‌ర‌కు సినిమా అంటే థియేట‌ర్ల‌లో చూడ‌ట‌మే తెలుసు. కానీ తెర వెనుక ఏం జ‌రుగుతుంది? యాక్ట‌ర్లు ఎలా న‌టిస్తారు? పాత్ర‌ల కోసం ఎంత క‌ష్ట‌ప‌డ‌తార‌న్న‌ది? త‌మిళ‌న్‌తోనే అర్థ‌మైంది. వాటికి తోడు త‌మిళ భాష నాకు కొత్త కావ‌డంతో ప్ర‌తి డైలాగ్ పేప‌ర్‌పై రాసుకొని బ‌ట్టి ప‌ట్టేదానిని" అని ప్రియాంక అన్నది.

సేమ్ రూల్‌....

"త‌మిళ‌నాట విజ‌య్‌కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో, అత‌డిని అభిమానులు ఎంత‌లా అభిమానిస్తారో త‌మిళ‌న్ మూవీతోనే తెలిసింద‌ని ప్రియాంక చోప్రా అన్న‌ది. విజ‌య్ క్రేజ్ చూసి షాక‌య్యాను. ఆయ‌న్ని ఫ్యాన్స్‌ దేవుడిలా ఆరాధించేవారు. విజ‌య్‌ని చూసేందుకు ప్ర‌తి రోజు సెట్స్ వంద‌లాది మంది వ‌చ్చేవారు. విజ‌య్ డ్యాన్స్ చేస్తుంటే... డైలాగ్స్ చెబుతుంటే చూస్తూ ఎంజాయ్ చేసేవారు. సెట్స్‌లో లైట్‌బాయ్ నుంచి డైరెక్ట‌ర్ వ‌ర‌కు అంద‌రిని విజ‌య్ గౌర‌వించేవారు. చాలా డిసిప్లిన్‌గా ఉంటారు. ఒక్క‌సారి సెట్స్‌లో అడుగుపెడితే డైరెక్ట‌ర్ ప్యాక‌ప్ చెప్పేవ‌ర‌కు బ‌య‌ట‌కు వెళ్లేవారు కాదు. ఆ విన‌యం, డిసిప్లిన్ న‌న్ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. విజ‌య్ నుంచి నేను నేర్చుకున్న మంచి విష‌యం అదే. ఇప్ప‌టికీ నేను సేమ్ రూల్ ఫాలో అవుతున్నా" అని ప్రియాంక చోప్రా  చెప్పింది.

 

Advertisement
Advertisement