త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hero Nani | మంచు విష్ణు సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన హీరో నాని – ఆ సినిమాలు ఏవంటే?

టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌తో దూసుకుపోతున్నాడు నాని. ప్ర‌స్తుతం ప్యార‌డైజ్‌, బ్ల‌డీ రోమియోతో పాటు మ‌రో రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వ‌క‌ముందు నాని...నితిన్‌, మంచు విష్ణు సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాడు.

N

Entertainment | Published On Feb 24, 2026, 6.34 pm IST

Hero Nani | మంచు విష్ణు సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన హీరో నాని – ఆ సినిమాలు ఏవంటే?
Advertisement

Hero Nani |  టాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ స‌క్సెస్ రేటు ఉన్న యంగ్ హీరోల్లో నాచుర‌ల్ స్టార్ నాని ఒక‌రు. నాని సినిమా అంటే హిట్టే అనే న‌మ్మ‌కం తెలుగు ఆడియెన్స్‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో క‌నిపిస్తుంటుంది. హీరోగా ఒకే జాన‌ర్‌కు ప‌రిమితం కావ‌డానికి నాని ఇష్ట‌ప‌డ‌డు. క్లాస్‌, మాస్ ఎలాంటి క‌థ‌ల‌కైనా న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని ఎన్నో సినిమాల‌తో నిరూపించుకున్నాడు. క‌థ‌, పాత్ర‌ల ప‌రంగా అత‌డు చూపించే వైవిధ్య‌తే నానిని టాలీవుడ్‌లో టాప్ హీరోగా నిలబెట్టింది.

నిర్మాత‌గా...

కేవ‌లం న‌ట‌న‌కే ప‌రిమితం కాకుండా నిర్మాత‌గా కూడా వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతున్నాడు. ఎలాంటి వార‌స‌త్వం లేకుండా నాని ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాడు. త‌న‌లాగే అవ‌కాశాల కోసం ఇబ్బందులు ప‌డుతోన్న కొత్త‌వాళ్ల‌ను ఎంక‌రేజ్ చేసేందుకే నిర్మాత‌గా మారిన‌ట్లు ప‌లు సంద‌ర్భాల్లో నాని చెప్పాడు.

చిన్న సినిమాల‌తో మొద‌లుపెట్టి...

హీరోగా నాని సినీ జ‌ర్నీ చిన్న సినిమాల‌తోనే మొద‌లైంది. ఒక్కో మెట్టూ ఎక్కుతూ పాన్ ఇండియ‌న్ హీరోగా మారిపోయాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికంటే ముందు నాని క్లాప్‌ అసిస్టెంట్‌, స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌లు సినిమాల‌కు ప‌నిచేశారు. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన అష్టాచ‌మ్మా సినిమాతో హీరోగా నాని సినీ కెరీర్ ఆరంభ‌మైంది.

ఢీ, అల్ల‌రి బుల్లోడు...

అష్టాచ‌మ్మా కంటే ముందు న‌టుడిగా అవ‌కాశాల కోసం చాలా రోజులే ప్ర‌య‌త్నించారు నాని. త‌న ఫొటో ఆల్బ‌మ్‌లు ప‌ట్టుకొని ఆఫీస్‌ల చుట్టూ తిరిగారు. కానీ ఎవ‌రూ అవ‌కాశాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో డైరెక్ష‌న్ విభాగంపై ఫోక‌స్ పెట్టారు. త‌మ బంధువుల ద్వారా దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు బాపు తెర‌కెక్కిస్తోన్న రాధాగోపాలం సినిమాకు క్లాప్ అసిస్టెంట్‌గా, స‌హాయ ద‌ర్శ‌కుడిగా ఛాన్స్ ద‌క్కించుకున్నాడు. ఈ సినిమా త‌ర్వాత నితిన్ హీరోగా కే రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన అల్ల‌రి బుల్లోడు తో పాటు మంచు విష్ణు హీరోగా న‌టించిన అస్త్రం, ఢీ సినిమాల‌కు కూడా నాని అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాడు. ఈ సినిమా టైటిల్ కార్డ్స్‌లో అసిస్టెంట్స్ డైరెక్ట‌ర్స్ లిస్ట్‌లో నాని పేరు క‌నిపిస్తుంది. ఢీ రిలీజైన త‌ర్వాత ఏడాదే నాని హీరోగా న‌టించిన డెబ్యూ మూవీ అష్టాచెమ్మా రిలీజ్ కావ‌డం గ‌మ‌నార్హం.ఓ వైపు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతూనే ఆర్జేగా కూడా ప‌నిచేశారు నాని. నాన్ స్టాప్ నానితో పేరుతో అప్ప‌ట్లో నాని చేసిన ఓ రేడియో షో బాగా పాపుల‌ర్ అయ్యింది.

Advertisement
Advertisement