Trp Rating | బుల్లితెరపై కూడా డిజాస్టర్ – ఎన్టీఆర్ వార్ 2కు షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్ – మరీ అంత తక్కువా!
ఎన్టీఆర్ వార్ 2 థియేటర్లలోనే కాకుండా టీవీలో కూడా డిజాస్టర్‌గా నిలిచింది. ఇటీవలే వార్ 2 తెలుగు వెర్షన్ స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యింది. ఈ ఫస్ట్ ప్రీమియర్‌కు కేవలం 1.85 టీఆర్‌పీ రేటింగ్‌తో డిసపాయింట్ చేసింది.
Entertainment | Published On May 14, 2026, 7.04 pm IST
Trp Rating | బాలీవుడ్‌లో తొలి అడుగు జూనియర్ ఎన్టీఆర్‌కు అచ్చిరాలేదు. హీరోగా హిందీలో చేసిన ఫస్ట్ మూవీ వార్2 డిజాస్టర్‌గా నిలిచింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ మూవీ గత ఏడాది ఆగస్ట్‌లో థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ మరో హీరోగా నటించాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు.
స్ట్రెయిట్ సినిమా స్థాయిలో...
దాదాపు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన థియేటర్లలో మూడు వందల కోట్ల లోపే వసూళ్లను వసూళ్లతో డిసపాయింట్ చేసింది. ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ కారణంగా తెలుగులో స్ట్రెయిట్ సినిమా స్థాయిలో వార్ 2 పై బజ్ ఏర్పడింది. కానీ బాలీవుడ్ రిజల్ట్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యింది.
స్టార్ మాలో...
థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఇటీవలే వార్ 2 మూవీ తెలుగు వెర్షన్ స్టార్ మా ఛానెల్‌లో టెలికాస్ట్ అయ్యింది. టీవీలో కూడా ఎన్టీఆర్ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ ఫస్ట్ ప్రీమియర్‌కు కేవలం 1.85 టీఆర్‌పీ రేటింగ్ మాత్రమే వచ్చింది. అర్బన్ ఏరియాలో 2.37 రేటింగ్‌తో నిరాశపరిచింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతి తక్కువ టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకున్న మూవీగా వార్ 2 చెత్త రికార్డును మూటగట్టుకుంది.
టెంపర్ హయ్యెస్ట్...
ఎన్టీఆర్ కెరీర్‌లో టెంపర్ 29.8 టీఆర్‌పీ రేటింగ్‌తో ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేసింది. ఆ స్థాయి నుంచి ఎన్టీఆర్ మూవీ రేటింగ్ 1.85 రేంజ్‌కు పడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
నెగెటివ్ క్యారెక్టర్‌లో....
వార్ 2లో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించారు. సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను గ్రాఫిక్స్ వాడి చిత్రీకరించారని, క్యారెక్టరైజేషన్‌లో బలం లేదంటూ చాలానే విమర్శలు వచ్చాయి. వార్ 2లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా...అనిల్ కపూర్ కీలక పాత్ర పోషించారు.
డ్రాగన్....
వార్ 2 తర్వాత సినిమాలకు ఏడాది పాటు గ్యాప్ ఇచ్చిన ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ మూవీ చేస్తోన్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మే 20న ఈ సినిమా స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Guppedantha Manasu Sequel | రిషికి ఐ లవ్ యూ చెప్పిన వసుధార – గుప్పెడంత మనసు 2 పై అప్డేట్?
ఆగస్టు 1, 2026

Saurav Das | హృతిక్ రోషన్‌లా కనిపించానేమో.. కంగనకు కాక్రోచ్ పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ కౌంటర్
జులై 30, 2026

Bigg Boss | బిగ్‌బాస్ హోస్ట్‌గా టీమిండియా కెప్టెన్ – హయ్యెస్ట్ రెమ్యూనరేషన్‌తో రికార్డ్
జులై 20, 2026
తాజావార్తలు
- ●Tollywood | ఆగస్ట్ బరిలో స్టార్స్ - టాక్సిక్ తో పాటు ఈ నెలలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే
- ●Sabarimala | శబరిమల అయ్యప్ప భక్తులకు హై అలర్ట్.. భారీ వర్షాలతో దేవస్వం బోర్డు కీలక సూచనలు..
- ●WABA | తల్లి పాలే శిశువుకు తొలి టీకా
- ●Peddi Sudarshan Reddy | 'పెద్ది' ఉద్యమ స్ఫూర్తిని ఎప్పటికీ మరువబోం : తన్నీరు మహేశ్
- ●H-FAST Raids | అక్కడే గుట్కా ఉమ్మి.. అక్కడే అప్పడాలు తయారు చేస్తున్నారు
- ●Sai Pallavi | సాయిపల్లవి మళ్లీ తప్పు చేస్తోందా? - మణిరత్నం సినిమా హాలీవుడ్ రీమేక్ అంటూ రూమర్లు

Tollywood | ఆగస్ట్ బరిలో స్టార్స్ - టాక్సిక్ తో పాటు ఈ నెలలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

Sabarimala | శబరిమల అయ్యప్ప భక్తులకు హై అలర్ట్.. భారీ వర్షాలతో దేవస్వం బోర్డు కీలక సూచనలు..

WABA | తల్లి పాలే శిశువుకు తొలి టీకా

Peddi Sudarshan Reddy | 'పెద్ది' ఉద్యమ స్ఫూర్తిని ఎప్పటికీ మరువబోం : తన్నీరు మహేశ్



