త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ntr – Trivikram | ఎన్టీఆర్ , త్రివిక్ర‌మ్ గాడ్ ఆఫ్ వార్ ఆగిపోయిందా? – ఫొటోతో రూమ‌ర్ల‌కు చెక్

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న గాడ్ ఆఫ్ వార్ మూవీ షూటింగ్ మొద‌లుకాక‌ముందే ఆగిపోయిన‌ట్లు రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ మూవీని ప‌క్క‌న‌పెట్టి చిరంజీవితో త్రివిక్ర‌మ్ త‌న త‌దుప‌రి సినిమా చేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పుకార్ల‌కు మేక‌ర్స్ ఓ ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టారు.

N

Entertainment | Published On Nov 13, 2026, 2.57 pm IST

Ntr – Trivikram | ఎన్టీఆర్ , త్రివిక్ర‌మ్ గాడ్ ఆఫ్ వార్ ఆగిపోయిందా? – ఫొటోతో రూమ‌ర్ల‌కు చెక్
Advertisement

Ntr - Trivikram |  ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ ఆగిపోయిందంటూ వ‌స్తోన్న రూమ‌ర్ల‌కు మేక‌ర్స్ చెక్ పెట్టారు. ఓ ఫొటోతో అభిమానుల‌ను ఖుషి చేశారు. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో గాడ్ ఆఫ్ వార్ పేరుతో ఓ మైథాల‌జీ మూవీ తెర‌కెక్కుతోంది. యుద్ద దేవుడిగా పురాణాలు పేర్కొన్నకుమార‌స్వామి క‌థ‌తో ఈ భారీ బ‌డ్జెట్ మూవీ తెర‌కెక్కుతోంది. హీరో ఎన్టీఆర్‌తో పాటు డైరెక్ట‌ర్‌ త్రివిక్ర‌మ్ కెరీర్‌లో తొలి భ‌క్తి ప్ర‌ధాన సినిమాగా రాబోతున్న గాడ్ ఆఫ్ వార్‌ను ఈ ఏడాదే అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.

ఆద‌ర్శ కుటుంబం...

కాగా ఇటీవ‌లే ఆద‌ర్శ కుటుంబం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు త్రివిక్ర‌మ్. వెంక‌టేష్ హీరోగా న‌టించిన ఈ క్రైమ్ కామెడీ మూవీ భారీ అంచ‌నాల న‌డుమ థియేట‌ర్ల‌లో రిలీజై డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ గాడ్ ఆఫ్ వార్‌పై ప‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆద‌ర్శ కుటుంబం రిజ‌ల్ట్ విష‌యంలో ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ , నిర్మాత రాధాకృష్ణ మ‌ధ్య విభేదాలు మొద‌లైన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

టేకింగ్‌ఫై విమ‌ర్శ‌లు...

ఆద‌ర్శ కుటుంబం సినిమాకు అనుకున్న స్థాయిలో హైప్ రాలేదు. ప‌లుమార్లు సినిమా వాయిదాప‌డ‌టం కూడా బ‌జ్ త‌గ్గ‌డానికి కార‌ణ‌మైంది. వాటికి తోడు త్రివిక్ర‌మ్ టేకింగ్‌పై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. భారీ న‌ష్టాల‌కు త్రివిక్ర‌మ్ కార‌ణ‌మంటూ నిర్మాత అసంతృప్తిగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గాడ్ ఆఫ్ వార్‌కు కూడా రాధాకృష్ణ నిర్మాత కావ‌డంతో త్రివిక్ర‌మ్‌తో మొద‌లైన విభేదాల కార‌ణంగా ఈ మైథాల‌జీ మూవీని ప‌క్క‌న‌పెట్టేయాల‌ని ఆయ‌న‌ నిర్ణ‌యించుకున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఎన్టీఆర్ మూవీ స్థానంలో చిరంజీవితో త్రివిక్ర‌మ్ సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది.

ఫొటోతో...

ఈ రూమ‌ర్ల‌కు మేక‌ర్స్ చెక్ పెట్టారు. ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌ల‌ను త్రివిక్ర‌మ్‌, డైరెక్ట‌ర్ చిన‌బాబు క‌లిసిన ఓ ఫొటోను నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేష‌న్స్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. గాడ్ ఆఫ్ ఆగిపోయిందంటూ వ‌స్తోన్న రూమ‌ర్ల‌తో పాటు నిర్మాత‌తో త్రివిక్ర‌మ్ విభేదాలు అంటూ వ‌స్తోన్న పుకార్ల‌కు ఈ ఒక్క ఫొటోతో బ‌దులిచ్చారు. ప్ర‌స్తుతం గాడ్ ఆఫ్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్నాయి. ఈ పాన్ ఇండియ‌న్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న డ్రాగ‌న్‌తో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. వ‌చ్చే ఏడాది జూన్‌లో ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement