Wamiqa Gabbi | హనుమాన్ సీక్వెల్‌లో లోకేష్ కనగరాజ్ హీరోయిన్ – పదకొండేళ్ల తర్వాత తెలుగు సినిమాలో ఛాన్స్!
కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన డీసీ మూవీలో చంద్ర అనే వేశ్య పాత్రలో అసమాన నటనను కనబరిచింది వామికా గబ్బి. తిరుగుబాటు మనస్తత్వమున్న అమ్మాయిగా తన హావభావాలతోనే మెప్పించింది. తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ పదకొండేళ్ల తర్వాత ఓ తెలుగు మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జై హనుమాన్ సీక్వెల్‌లో ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
Entertainment | Published On Aug 11, 2026, 2.22 pm IST
Wamiqa Gabbi | లోకేష్ కనగరాజ్ హీరోగా ఇటీవల రిలీజైన డీసీ మూవీలో చంద్ర అనే పాత్రలో కనిపించింది బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి. వేశ్య పాత్రలో రా అండ్ రస్టిక్ యాక్టింగ్‌తో అభిమానులను మెప్పించింది. వేశ్య అనగానే బోల్డ్‌గా, గ్లామరస్‌గా చూపించడం కాకుండా రెబెల్ అటిట్యూడ్ ఉన్న అమ్మాయిగా కొత్త కోణంలో డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ వామికా గబ్బి పాత్రను తీర్చిదిద్దారు. డీసీలో తన నటనతో లోకేష్ కనగరాజ్‌ను డామినేట్ చేసింది వామికా. డీసీతో లాంగ్ గ్యాప్ తర్వాత దక్షిణాదిలో బిగ్గెస్ట్ సక్సెస్‌ను దక్కించుకుంది.
హనుమాన్ సీక్వెల్...
డీసీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఈ బ్యూటీ తాజాగా తెలుగులో ఓ మైథాలజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాతో దాదాపు పదకొండేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి పునరాగమనం చేయబోతుంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రూపొందిన బ్లాక్‌బస్టర్ మూవీ హనుమాన్ కు సీక్వెల్ రాబోతుంది. జై హనుమాన్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీక్వెల్‌లో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. రానా దగ్గుబాటి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
వారధిగా...
ఈ బ్లాక్‌బస్టర్ సీక్వెల్‌లో వామికా గబ్బి భాగం కానున్నట్లు సమాచారం. ఓ కీలక పాత్ర కోసం ఈ బాలీవుడ్ బ్యూటీని మేకర్స్ కన్ఫామ్ చేశారట. రాముడికి, హనుమంతుడికి మధ్య వారధిగా వామికా గబ్బి క్యారెక్టర్ సాగుతుందని అంటున్నారు. డీసీలో వామికా గబ్బి నటనకు ఇంప్రెస్ అయిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్‌లో కీలక పాత్ర కోసం వామికా గబ్బిని అప్రోచ్ అయినట్లు సమాచారం.
200 కోట్ల బడ్జెట్...
ఈ సీక్వెల్‌లో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించబోతుండగా...అశ్వత్థామ పాత్రను రానా దగ్గుబాటి పోషిస్తున్నారు. హనుమాన్ సీక్వెల్ దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. జై హనుమాన్ కాకుండా మరో ఏడు సినిమాలను అంగీకరించింది వామికా గబ్బి. హిందీ, తమిళం, మలయాళంతో పాటు పంజాబీ భాషల్లో సినిమాలు చేస్తోంది. తెలుగులో 2015లో వచ్చిన భలే మంచి రోజులో వామికా గబ్బి హీరోయిన్‌గా నటించింది. పదకొండేళ్ల తర్వాత జై హనుమాన్‌తో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. జై హనుమాన్‌తో పాటు అడివి శేష్‌తో గూఢచారి 2లో నటిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

DC Review | డీసీ రివ్యూ – మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? – హీరోగా హిట్టు కొట్టాడా?
ఆగస్టు 7, 2026

Prabhas Fauzi | అఫీషియల్ – ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్ – యుద్ధభూమిలో వీరుడిగా ప్రభాస్ – పోస్టర్ వైరల్
జులై 16, 2026

Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..
జులై 6, 2026
తాజావార్తలు
- ●Ramchander Rao | ఖార్ఖానా ఖరీదైన అర్బన్ ప్రాంతం.. పరిహారం పెంచాల్సిందే : ఎన్ రాంచందర్ రావు
- ●NEET | నీట్‌ను రద్దు చేయాలి.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన విజయ్ సర్కార్
- ●Telangana Voters | తెలంగాణ ఓటర్లు మొత్తం 2,64,87,214 మంది
- ●Harish Rao | రైతులు ఎదురు చూస్తున్నరు.. రిజర్వాయర్లకు 30 టీఎంసీల నీటిని వెంటనే ఎత్తిపోయండి
- ●Lalithaa Jewellery Mart IPO | ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. లలితా జ్యువెలరీ ఐపీవో వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..
- ●Abhijeet Dipke | రండి.. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుద్దాం : సీజేపీ పిలుపు

Ramchander Rao | ఖార్ఖానా ఖరీదైన అర్బన్ ప్రాంతం.. పరిహారం పెంచాల్సిందే : ఎన్ రాంచందర్ రావు

NEET | నీట్‌ను రద్దు చేయాలి.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన విజయ్ సర్కార్

Telangana Voters | తెలంగాణ ఓటర్లు మొత్తం 2,64,87,214 మంది

Harish Rao | రైతులు ఎదురు చూస్తున్నరు.. రిజర్వాయర్లకు 30 టీఎంసీల నీటిని వెంటనే ఎత్తిపోయండి



