Hanuman 2 | ప్రశాంత్ వర్మతో వివాదం – మెగా హీరోతో హనుమాన్ 2 అనౌన్స్
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఉప్పెన హీరో వైష్ణవ్‌తేజ్ కొత్త సినిమాను అనౌన్స్‌చేశాడు.ఓ మైథాలజీ మూవీ చేయబోతున్నాడు. హనుమాన్ 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ జై హనుమాన్‌కు పోటీగా ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Nov 21, 2026, 11.39 am IST
Hanuman 2 | తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్వకత్వంలో రూపొందిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కేవలం 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మైథాలజీ సూపర్ హీరో మూవీ 350 కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది. హనుమాన్ బ్లాక్‌బస్టర్‌తో తేజా సజ్జాతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు టాలీవుడ్‌లో మోరుమోగింది.
జై హనుమాన్....
ప్రస్తుతం హనుమాన్ మూవీకి సీక్వెల్‌గా జై హనుమాన్‌ను తెరకెక్కిస్తోన్నారు ప్రశాంత్ వర్మ. రిషబ్ శెట్టి, రానా దగ్గుబాటితో పాటు పలువురు స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
హనుమాన్ 2....
తాజాగా ప్రశాంత్ వర్మ సీక్వెల్‌కు పోటీగా మరో సినిమా వచ్చేస్తోంది. హనుమాన్ సినిమాను నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ హనుమాన్ 2 పేరుతో కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. ఇందులో ఉప్పెన ఫేమ్ పంజా వైష్ణవ్‌తేజ్ హీరోగా కనిపించబోతున్నాడు. వీఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆంజనేయుడి ఉగ్రరూపం....
హనుమాన్ 2ను అనౌన్స్ చేసిన మేకర్స్ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో హనుమంతుడి తోక ఓ యువకుడిని చుట్టుకొని ఉంది. అతడి ఎదురుగా మేఘాల్లో ఆంజనేయుడు ఉగ్ర రూపంలో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ది రైజ్ ఆఫ్ వానరాస్ అంటూ టైటిల్ కింద క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ప్రశాంత్ వర్మతో వివాదం....
ప్రశాంత్ వర్మ జై హనుమాన్‌కు పోటీగానే హనుమాన్ సీక్వెల్‌ను ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ తెరకెక్కించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హనుమాన్ తర్వాత ఇదే బ్యానర్‌లో ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయాల్సింది. కానీ నిర్మాతలతో ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా ఆగిపోయింది. ప్రైమ్ షో అధినేత నిరంజన్‌రెడ్డి....ప్రశాంత్ వర్మపై సంచలన ఆరోపణలు చేశారు. తదుపరి సినిమాల కోసం కోట్లలో ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్‌లు ఇచ్చామని తమ కమిట్‌మెంట్లను పక్కనపెట్టి ఇతర నిర్మాణ సంస్థలతో సినిమాలు చేస్తున్నాడంటూ పేర్కొన్నారు. ప్రశాంత్ వర్మపై ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. 200 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పట్లో ఈ వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు హనుమాన్ 2 పేరుతో నిరంజన్ రెడ్డి సినిమా చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది.
మూడేళ్ల గ్యాప్ తర్వాత....
ఉప్పెన సినిమాతో తొలి అడుగులోనే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు వైష్ణవ్‌తేజ్. ఈ హిట్ తర్వాత కొండపొలం, రంగరంగ వైభవంగాతో పాటు ఆదికేశవ సినిమాలు చేశాడు. కథల ఎంపికలో పొరపాట్ల కారణంగా ఈ సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. ఈ ఫ్లాప్‌ల తర్వాత మూడేళ్లు కెరీర్‌కు గ్యాప్ ఇచ్చిన వైష్ణవ్‌తేజ్ తిరిగి హనుమాన్ 2తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
What began with a dream continues with an even bigger vision❤️🔥
Proud to take the legacy of #HanuMan forward with our next ambitious venture.
Presenting #HanuMan2 – THE RISE OF VANARAS 🔥
Looking forward to this exciting collaboration with #PanjaVaisshnavTej and the https://t.co/LXjrDhneEe
— Primeshow Entertainment (@Primeshowtweets) November 21, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Teja Sajja | సందడిగా తేజా సజ్జా ఎంగేజ్మెంట్ – కాబోయే భార్య పేరు చెప్పేసిన హనుమాన్ హీరో
నవంబర్ 16, 2026

Teja Sajja | గ్రాండ్‌గా హీరో తేజా సజ్జా ఎంగేజ్మెంట్ – పెళ్లి ఎప్పుడంటే?
నవంబర్ 16, 2026

The Traitors Telugu | ది ట్రైటర్స్ తెలుగు సీజన్ వన్ విన్నర్ ఎవరంటే? – ఇద్దరికి దక్కిన ప్రైజ్‌మనీ
నవంబర్ 6, 2026
తాజావార్తలు
- ●Congress | పార్టీ వ్యవహారాల ఇన్చార్జిని కలవండి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం
- ●Donald Trump | భారత్‌లోనే తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయ్.. ఫెడ్‌పై ట్రంప్ విమర్శలు
- ●EPFO WhatsApp Service | వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్.. పాస్‌బుక్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
- ●Kiren Rijiju | 1962 నాటి అవమానానికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? : రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్
- ●Gold And Silver Prices Today | మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఏడాది కనిష్ట స్థాయిలకు చేరిక..
- ●Eating Noodles | నూడుల్స్ తిని ఏడేళ్ల బాలిక మృతి

Congress | పార్టీ వ్యవహారాల ఇన్చార్జిని కలవండి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం

Donald Trump | భారత్‌లోనే తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయ్.. ఫెడ్‌పై ట్రంప్ విమర్శలు

EPFO WhatsApp Service | వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్.. పాస్‌బుక్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

Kiren Rijiju | 1962 నాటి అవమానానికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? : రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్



