త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pooja Hegde | తొలి సినిమా హీరోతో బుట్ట‌బొమ్మ బాక్సాఫీస్ ఫైట్ – పూజా హెగ్డే శ్రీశ్రీ రిలీజ్ డేట్ ఇదేనా?

డెబ్యూ మూవీ హీరో నాగ‌చైత‌న్య‌తో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే బాక్సాఫీస్ ఫైట్‌కు సిద్ధమైంది. నాగ‌చైత‌న్య వృష‌క‌ర్మ‌, పూజా హెగ్డే శ్రీశ్రీ సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లో థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు స‌మాచారం. నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన ఒక లైలా కోసం సినిమాతోనే పూజా హెగ్డే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

N

Entertainment | Published On Sep 10, 2026, 6.12 pm IST

Pooja Hegde | తొలి సినిమా హీరోతో బుట్ట‌బొమ్మ బాక్సాఫీస్ ఫైట్ – పూజా హెగ్డే శ్రీశ్రీ రిలీజ్ డేట్ ఇదేనా?
Advertisement

Pooja Hegde |  నాగ‌చైత‌న్య ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. తాజాగా ఈ అక్కినేని హీరోతోనే బాక్సాఫీస్ ఫైట్‌కు రెడీ అయ్యింది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ కావాల‌ని బుట్ట‌బొమ్మ క‌ల‌లు క‌న్న‌ది కానీ ప‌రాజ‌యాలు ఆమె ఆశ‌ల‌ను దెబ్బ‌తీశాయి. ఆచార్య త‌ర్వాత నాలుగేళ్ల పాటు తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా కూడా ద‌క్కించుకోలేక‌పోయింది. ఈ గ్యాప్‌లో త‌మిళం, బాలీవుడ్‌లో సినిమాలు చేసినా అక్క‌డ కూడా అదృష్టం క‌లిసిరాలేదు.

దుల్క‌ర్ స‌ల్మాన్‌...

నాలుగేళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత శ్రీశ్రీ మూవీతో టాలీవుడ్‌లోకి పున‌రాగ‌మ‌నం చేస్తోంది పూజా హెగ్డే. రొమాంటిక్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టిస్తోన్నాడు. ర‌వి నేల‌కుడిటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

డిసెంబ‌ర్‌లో...

శ్రీశ్రీ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. డిసెంబ‌ర్ 4న శ్రీశ్రీ థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు స‌మాచారం. విడుద‌ల తేదీని మేక‌ర్స్ త్వ‌ర‌లో అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. శ్రీశ్రీ మూవీకి ముందు రోజు డిసెంబ‌ర్ 3న వృష‌క‌ర్మ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. డెబ్యూ హీరో నాగ‌చైత‌న్య‌కు పోటీగా పూజా హెగ్డే సినిమా రిలీజ్ కాబోతుండ‌టం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఫౌజీ వాయిదా...

డిసెంబ‌ర్ 3న రిలీజ్ కావాల్సిన ప్ర‌భాస్ ఫౌజీ షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కానుండ‌టంతో వాయిదా ప‌డ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌భాస్ సినిమా పోస్ట్‌పోన్‌తో ఆ వీక్‌లోనే వృష‌క‌ర్మ‌, శ్రీశ్రీ సినిమాల‌ను ఒక్క రోజు గ్యాప్‌తో థియేట‌ర్ల‌లోకి తీసుకురావాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

ఫ‌స్ట్ హార‌ర్ మూవీ

ప్ర‌స్తుతం త‌మిళంలో కాంచ‌న 4 సినిమా చేస్తోంది పూజా హెగ్డే. బుట్ట‌బొమ్మ కెరీర్‌లో ఫ‌స్ట్ హార‌ర్ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. లారెన్స్ హీరోగా న‌టిస్తూ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

 

Advertisement
Advertisement