Bigg Boss | బిగ్‌బాస్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ – రెడ్ కార్డుతో ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్
బిగ్‌బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ ఇద్దరు కంటెస్టెంట్స్‌కు రెడ్ కార్డ్ ద్వారా హౌజ్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నారు. బిగ్‌బాస్ తమిళ సీజన్ 9లో పారు, కమ్రుద్దీన్‌లను రెడ్ కార్డు జారీ చేశారు హోస్ట్ విజయ్ సేతుపతి. వారిని హౌజ్ నుంచి వెళ్లిపోవాలని ఆర్డర్ వేశారు. ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Entertainment | Published On Jan 4, 2026, 5.52 pm IST
Bigg Boss | తమిళ బిగ్‌బాస్ సీజన్ 9లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రెడ్ కార్డ్‌తో ఇద్దరు కంటెస్టెంట్స్‌ను హోస్ట్ విజయ్ సేతుపతి అర్థాంతరంగా ఇంటికి పంపించేసినట్లు సమాచారం. తమిళ బిగ్‌బాస్ హిస్టరీలోనే రెడ్ కార్డ్‌తో హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్స్‌గా పారు, కమ్రుద్దీన్ నిలవనున్నారు.
విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తమిళ బిగ్‌బాస్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్స్ హౌజ్‌లో ఉన్నారు. వీరిలో అరోరా ఫైనల్ చేరుకుంది.
ఈ సండే ఎపిసోడ్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్ హౌజ్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నట్లు సమాచారం. అదీ కూడా రెడ్ కార్డ్ ద్వారా వారిని పంపించేయబోతున్నారట. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ చక్కర్లుకొడుతోంది.
టికెట్ టూ ఫినాలే
టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో భాగంగా కారులోనే రాత్రంతా కూర్చోవాలని బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా అనుకోకుండా సాండ్రాతో పారు, కమ్రుద్దీన్ గొడవపడ్డారు. సాండ్రాను ఇద్దరు కలిసి బలంగా కారు నుంచి బయటకు తోసేశారు. కారు డోర్‌లో చిక్కుకొని సాండ్రా కాలుకు గాయమైంది. మెడికల్ ఎమర్జెన్సీ సాయాన్ని కోరింది. ఆమెకు సాయం చేయడానికి మిగిలిన కంటెస్టెంట్స్ టాస్క్ నుంచి తప్పుకున్నారు. కానీ పారు, కమ్రుద్దీన్ మాత్రం గేమ్‌ను కంటిన్యూ చేశారు. వారి ప్రవర్తనను విజయ్ సేతుపతి తప్పుపట్టారు. బిగ్‌బాస్ రూల్స్‌కు విరుద్దంగా గేమ్ ఆడారని పారు, కముద్దీన్‌పై ఫైర్ అయ్యారు. ఇద్దరికీ రెడ్ కార్డ్ ఇష్యూ చేశారు. వెంటనే హౌజ్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లుగా ప్రోమోలో కనిపిస్తోంది.
ఈ రోజు రాత్రి టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్‌లో పారు, కమ్రుద్దీన్ హౌజ్ నుంచి వెళ్లిపోయారా? బిగ్‌బాస్ వారిని క్షమించేసిందా? అన్నది డిసైడ్ కాబోతుంది. ఒకవేళ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయితే రెడ్‌కార్డ్ ద్వారా హౌజ్ నుంచి వెళ్లిపోయిన ఫస్ట్ కంటెస్టెంట్స్‌గా వీరిద్దరు నిలువనున్నారు. జనవరి నెలాఖరున బిగ్‌బాస్ తమిళ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే జరుగనుంది.
సంబంధిత వార్తలు

Bigg Boss Ayesha | హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ – సుడిగాలి సుధీర్‌తో రొమాన్స్
మే 18, 2026

Sai Pallavi | టైమ్ వచ్చినప్పుడు నేనే చెబుతా – పెళ్లిపై సాయిపల్లవి రియాక్షన్
మార్చి 28, 2026

Kaattaan Web Series Review | కాట్టాన్ రివ్యూ – విజయ్ సేతుపతి క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
మార్చి 27, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



