Sai Pallavi | తల్లి పాత్రలో సాయిపల్లవి – మూడు నెలల గ్యాప్‌లో మూడు సినిమాలు
నాచురల్ బ్యూటీ సాయిపల్లవి ఇద్దరు చిన్నారులకు తల్లిగా కనిపించబోతుంది. విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా తమిళంలో ఇంజివెల్లం పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. మణిరత్నం దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ జనవరి 29న థియేటర్లలోకి రాబోతుంది.
Entertainment | Published On Nov 12, 2026, 2.53 pm IST
Sai Pallavi | ఇటీవలే రామాయణ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది సాయిపల్లవి. ఈ మైథాలజీ మూవీతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఫస్ట్ హిట్‌ను దక్కించుకుంది. రామాయణ తర్వాత ఈ నెలలోనే సాయిపల్లవి తమిళ మూవీ ఓం థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నాచురల్ బ్యూటీ కనిపించబోతుంది.
పాత్రల ఎంపికలో ప్రయోగాలు, వైవిధ్యతకు ప్రాధాన్యతనిస్తోన్న సాయిపల్లవి తదుపరి సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించబోతుంది.
ఫస్ట్ లుక్...
విజయ్ సేతుపతి, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో ఇంజివెల్లం పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను గురువారం రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదత లేదీని కూడా వెల్లడించారు.
తల్లిదండ్రులుగా...
ఇంజివెల్లం ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఇద్దరు చిన్నారులతో విజయ్ సేతుపతి, సాయిపల్లవి ఆనందంగా కనిపిస్తోన్నారు. వారి బ్యాక్‌గ్రౌండ్‌లో కోల్‌కతా సిటీ కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఆ ఇద్దరు చిన్నారులకు తల్లిదండ్రులుగా విజయ్ సేతుపతి, సాయిపల్లవి నటిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇంజివెల్లం ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
అల్లంబెల్లం...
ఇందులో ఇంజి (అల్లం) ఎవరు..వెల్లం (బెల్లం) ఎవరు.... టాస్క్ అలర్ట్ అంటూ మేకర్స్ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చారు.ఫస్ట్ లుక్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా రివీల్ చేశారు. జనవరి 29న ఈ మూవీ విడుదల కాబోతున్నట్లు చెప్పారు.
రెమ్యూనరేషన్ తగ్గించుకొని...
ఇంజివెల్లం సినిమాను లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్నారు. మణిరత్నంపై ఉన్న అభిమానంతో తమ రెమ్యూనరేషన్ తగ్గించుకొని సాయిపల్లవి, విజయ్ సేతుపతి ఈ సినిమా చేశారు. కేవలం ఆరు నెలల టైమ్‌లోనే షూటింగ్, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మూడు నెలల గ్యాప్‌లో సాయిపల్లవి నుంచి రాబోతున్న మూడో సినిమా ఇది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్ కావడం నాచురల్ బ్యూటీ కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైమ్.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ponguleti Srinivas Reddy | 22ఏ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి
- ●Daily SIP | డైలీ ఎస్ఐపీ వర్సెస్ మంత్లీ ఎస్ఐపీ.. ఏది బెస్ట్? రాబడిలో తేడా ఎంత?
- ●India Visa Rules | భారతీయ వీసాల ప్రక్రియ మరింత సులభతరం.. కేటగిరీల సంఖ్య 13 నుంచి 9కి కుదింపు
- ●Green India Challenge | ప్రతి ఇంట్లో ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వ మొక్కలు నాటుతాం.. ప్రజలకు అవగాహన కల్పిస్తాం
- ●Bigg Boss | బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంగేజ్మెంట్ - ప్రియురాలికి ప్రపోజ్ చేసిన శివకుమార్
- ●Women's Commission | లైంగిక ఆరోపణల కేసు.. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన వీసీ జానయ్య

Ponguleti Srinivas Reddy | 22ఏ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి

Daily SIP | డైలీ ఎస్ఐపీ వర్సెస్ మంత్లీ ఎస్ఐపీ.. ఏది బెస్ట్? రాబడిలో తేడా ఎంత?

India Visa Rules | భారతీయ వీసాల ప్రక్రియ మరింత సులభతరం.. కేటగిరీల సంఖ్య 13 నుంచి 9కి కుదింపు

Green India Challenge | ప్రతి ఇంట్లో ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వ మొక్కలు నాటుతాం.. ప్రజలకు అవగాహన కల్పిస్తాం






