Malayalam OTT | హీరోయిన్‌గా మోహన్‌లాల్ కూతురు – ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ – తెలుగులో రిలీజ్
మోహన్‌లాల్ కూతురు విస్మయ హీరోయిన్‌గా నటించిన తుడక్కం మూవీ యాభై కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతోనే కథానాయికగా మారింది విస్మయ. ఈ మలయాళం సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. సెప్టెంబర్ 18 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Sep 5, 2026, 7.35 pm IST
Malayalam OTT | మలయాళ అగ్ర హీరో మోహన్‌లాల్ కూతురు విస్మయ తుడక్కం మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో తొలి అడుగులోనే పెద్ద విజయాన్ని అందుకుంది. థియేటర్లలో ఈ మూవీ యాభై కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది.
గెస్ట్ రోల్....
తుడక్కం మూవీకి 2018 ఫేమ్ జ్యూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మోహన్‌లాల్ ఓ గెస్ట్ రోల్‌లో కనిపించాడు. తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి స్క్రీన్‌పై కనిపించే సీన్లు అభిమానులను ఆకట్టుకున్నాయి.
థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన తుడక్కం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి. సెప్టెంబర్ 18 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
మార్షల్ ఆర్ట్స్...
మహిళా సాధికారతకు యాక్షన్ అంశాలను జోడించి దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించారు. తొలి సినిమాతోనే తన నటనతో విస్మయ అభిమానులను ఆకట్టుకుంది. మీను ఓ ధైర్యవంతురాలైన యువతి. మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటుంది. ఓ సారి ప్రమాదంలో ఉన్న ఇద్దరు చిన్నారులను మీను కాపాడుతుంది. ఆ సంఘటన కారణంగా ఓ కిల్లర్ గ్యాంగ్‌కు మీను టార్గెట్‌గా మారిపోతుంది. ఆ కిల్లర్స్ బారి నుంచి మీను తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది? అన్నదే ఈ మూవీ కథ.
తుడక్కం మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు. తొలి సినిమాతోనే హిట్టు కొట్టిన విస్మయ ప్రస్తుతం మలయాళంలో మరో రెండు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OTT | ఓటీటీలోకి మాధవన్ బయోపిక్ మూవీ – బ్రిటీషర్లను ఎదురించిన ఇండియన్ సైంటిస్ట్ కథ
సెప్టెంబర్ 1, 2026

Malayalam OTT | ఓటీటీలోకి మైండ్ బ్లాక్ ట్విస్ట్‌లతో సాగే మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ – తెలుగులో రిలీజ్
ఆగస్టు 25, 2026

Aditi Rao Hydari | ఓటీటీలోకి అదితిరావ్ హైదరీ బోల్డ్ మూవీ – నలుగురు హీరోయిన్లు – నాలుగు కథలు
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●CP Sajjanar | గణేశ్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
- ●Tr Prefix For Teachers | డాక్టర్లకు 'Dr.', ఇంజనీర్లకు 'Er.'.. మరి టీచర్లకు? కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఆదర్శం
- ●CM Revanth Reddy | పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు.. కేసీఆర్‌పై రేవంత్ విమర్శలు
- ●HYDRAA Ranganath | ఆ బండపై వ్యూ పాయింట్ పెట్టండి.. చెరువు చుట్టూ పచ్చదనం పెంచండి: రంగనాథ్
- ●Vemula Prashanth Reddy | ఒక్కో నిరుద్యోగికి తక్షణమే రూ.1.32 లక్షలు చెల్లించాలి
- ●Thalapathy Vijay Father | కొత్త కారు కొన్న దళపతి విజయ్ తండ్రి - పెళ్లి రోజు గిఫ్ట్

CP Sajjanar | గణేశ్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

Tr Prefix For Teachers | డాక్టర్లకు 'Dr.', ఇంజనీర్లకు 'Er.'.. మరి టీచర్లకు? కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఆదర్శం

CM Revanth Reddy | పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు.. కేసీఆర్‌పై రేవంత్ విమర్శలు

HYDRAA Ranganath | ఆ బండపై వ్యూ పాయింట్ పెట్టండి.. చెరువు చుట్టూ పచ్చదనం పెంచండి: రంగనాథ్



