త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vishwak Sen | దేవర నిర్మాతతో విశ్వక్ సేన్ కొత్త సినిమా… క్లాప్ కొట్టిన డైరెక్టర్ కొరటాల శివ

దేవ‌ర నిర్మాత‌తో మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా సోమ‌వారం అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్‌కు దేవ‌ర డైరెక్ట‌ర్ కొర‌టాల శివ చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు.

N

Entertainment | Published On Apr 13, 2026, 3.52 pm IST

Vishwak Sen | దేవర నిర్మాతతో విశ్వక్ సేన్ కొత్త సినిమా… క్లాప్ కొట్టిన డైరెక్టర్ కొరటాల శివ
Advertisement

Vishwak Sen |  ఎన్టీఆర్ దేవ‌ర మూవీతో నిర్మాత‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు సుధాక‌ర్ మిక్కిలినేని. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ఐదు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. దేవ‌ర మూవీకి సీక్వెల్‌గా దేవ‌ర 2 కూడా రాబోతుంది. కాగా దేవ‌ర 2 సెట్స్‌పైకి రావ‌డానికి ముందే నిర్మాత సుధాక‌ర్ మిక్కిలినేని మ‌రో సినిమాను మొద‌లుపెట్టారు. విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీ సోమ‌వారం హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది.

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌....

న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు ర‌జ‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. భాను భోగ‌వ‌ర‌పు, నందు డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్స‌వ వేడుక‌కు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు. విశ్వ‌క్‌సేన్ పై చిత్రీక‌రించిన ఫ‌స్ట్ షాట్‌కు కొర‌టాల క్లాప్ నిచ్చారు. నిర్మాత శ్యామ్‌ప్ర‌సాద్ రెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు.

ప్ర‌జెంట‌ర్‌గా...

దేవ‌ర‌, దేవ‌ర 2 త‌ర్వాత యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న మూడో సినిమా ఇద‌ని నిర్మాత సుధాక‌ర్ మిక్కిలినేని పేర్కొన్నారు. హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాకు ప్ర‌జెంట‌ర్‌గా విశ్వ‌క్‌సేన్ వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. తేజ‌స్ కృష్ణ మ్యూజిక్ అందిస్తున్నాడు.

నాలుగు సినిమాలు....

ప్ర‌స్తుతం హీరోగా నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు విశ్వ‌క్‌సేన్‌. క‌ల్ట్ పేరుతో స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వ‌క్‌సేన్ ఓ యాక్ష‌న్ మూవీని తెర‌కెక్కిస్తోన్నారు. అలాగే పొలిటిక‌ల్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న లెగ‌సీలో హీరోగా క‌నిపించ‌బోతున్నాడు. వీటితో పాటు ఈ న‌గ‌రానికి ఏమైంది 2తో పాటు మ‌రో యాక్ష‌న్ మూవీకి ఇటీవ‌లే గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు.

Advertisement
Advertisement