Funky Release Date | అప్పుడు పోస్ట్‌పోన్ – ఇప్పుడు ప్రీపోన్ – వాలెంటైన్స్ డే బరిలో విశ్వక్‌సేన్ ఫంకీ
Funky Release Date | విశ్వక్‌సేన్ ఫంకీ మూవీ అనుకున్న డేట్ కంటే ముందుగానే థియేటర్లలోకి రాబోతుంది. ఏప్రిల్ 3న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను మేకర్స్ ప్రీ పోన్ చేశారు. వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న రిలీజ్ కాబోతుంది.
Entertainment | Published On Dec 15, 2025, 4.50 pm IST
ఫంకీ రిలీజ్ డేట్
Funky Release Date | విశ్వక్‌సేన్ (Viswak Sen) ఫంకీ (Funky Movie) అనుకున్నదానికంటే ముందుగానే థియేటర్లలోకి వస్తుంది. ఫన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నాడు. కయదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్‌గా నటిస్తోంది.
తొలుత ఫంకీ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ అనుకున్నారు. కానీ షూటింగ్ డిలే వల్ల ఏప్రిల్ 3కు ఈ సినిమా వాయిదాపడింది. పోస్ట్‌పోన్‌కు సంబంధించి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. తాజాగా వాయిదాపై మేకర్స్ వెనక్కి తగ్గారు.
అనుకున్న డేట్ కంటే ఓ రెండు నెలలు ముందుగానే ఫంకీ థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాను ప్రీ పోన్ చేస్తున్నట్లు సోమవారం మేకర్స్ ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు.
వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న ఫంకీ రిలీజ్ కాబోతుంది. విడుదల తేదీతో పాటు కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.
ఫంకీ మూవీలో విశ్వక్‌సేన్ సినిమా డైరెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ ఫన్ డ్రామా మూవీలో టాలీవుడ్ ఇండస్ట్రీపై చాలానే సెటైర్స్ ఉంటాయట. కయదు లోహర్ ప్రొడ్యూసర్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. అనుదీప్ స్టైల్ పంచ్‌లు, ప్రాసలతో పాటు అంతర్లీనంగా ఓ బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ ఉంటుందని సమాచారం. ఫంకీ షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఓ సాంగ్‌తో పాటు కొంత టాకీ పార్ట్ మాత్రమే బ్యాలెన్స్‌గా ఉందట.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం హీరోగా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్‌తో విశ్వక్‌సేన్ బిజీగా ఉన్నాడు. ఫంకీతో పాటు ఈ నగరానికి ఏమైంది 2, లెగసీ సినిమాలు చేయబోతున్నాడు.
జాతిరత్నాలుతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ అనుదీప్ ఆ తర్వాత తమిళంలో శివకార్తికేయన్‌తో ప్రిన్స్ సినిమా చేశాడు. కామెడీ వర్కవుట్ అయినా కమర్షియల్‌గా ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఫంకీ సక్సెస్ అనుదీప్ కెరీర్‌కు కీలకంగా మారింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



