త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Funky Trailer | క‌ర్రీ పాయింట్‌లో డ‌బ్బులు ఇవ్వ‌వంట‌గా – విశ్వ‌క్‌సేన్ ఫంకీ ట్రైల‌ర్ రిలీజ్‌

విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తున్న ఫంకీ మూవీ ట్రైల‌ర్ శ‌నివారం రిలీజైంది. పంచ్‌లు, ప్రాస‌ల‌తో ఆద్యంతం ట్రైల‌ర్ ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగింది. క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకు జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

N

Entertainment | Published On Feb 7, 2026, 6.42 pm IST

Funky Trailer | క‌ర్రీ పాయింట్‌లో డ‌బ్బులు ఇవ్వ‌వంట‌గా –  విశ్వ‌క్‌సేన్ ఫంకీ ట్రైల‌ర్ రిలీజ్‌
Advertisement

Funky Trailer | విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించిన ఫంకీ మూవీ ఫిబ్ర‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సినిమా ఇండ‌స్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీకి జాతిర‌త్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఫంకీ మూవీని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

ట్రైల‌ర్ రిలీజ్‌...

ఫంకీ మూవీ ట్రైల‌ర్‌ను శ‌నివారం రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. విశ్వ‌క్ సేన్ పంచ్‌లు, ప్రాస‌ల‌తో ఆద్యంతం ఎంట‌ర్‌టైనింగ్‌గా ఈ ట్రైల‌ర్ సాగింది. ఫంకీలో విశ్వ‌క్‌సేన్ కోమ‌ల్ సినిమా డైరెక్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు ట్రైల‌ర్ ద్వారా హింట్ ఇచ్చారు. ప్రొడ్యూస‌ర్ కూతురిగా క‌య‌దు లోహ‌ర్ న‌టిస్తోంది. నాలుగు కోట్లు బ‌డ్జెట్ చెప్పి న‌ల‌భై కోట్లు ఖ‌ర్చు పెట్టించిన కోమ‌ల్‌తో కేవ‌లం కోటి రూపాయ‌ల బ‌డ్జెట్‌తోనే సినిమా చేస్తాన‌ని హీరోయిన్ ఛాలెంజ్ చేయ‌డంతో ఈ క్ర‌మంలో ఎదుర‌య్యే సంఘ‌ట‌న‌తో ఎంట‌ర్‌టైనింగ్‌గా ఈ సినిమా సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

సుకుమార్‌...త్రివిక్ర‌మ్‌...

ఈ ట్రైల‌ర్‌లో సుకుమార్‌, త్రివిక్ర‌మ్ లాంటి ద‌ర్శ‌కుల ప్ర‌స్తావ‌న రావ‌డం ఆస‌క్తిని పంచింది. ట్రైల‌ర్ చివ‌ర‌లో... కోమల్ నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అడగాలి అని విశ్వ‌క్‌సేన్‌తో అన్న హీరోయిన్‌... నువ్వు ఏ కర్రీ పాయింట్ లో డబ్బులు ఇవ్వ‌వంట‌గా అన‌డం న‌వ్వుల‌ను పూయిస్తోంది.

ఏడాది గ్యాప్‌...

ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో విశ్వ‌క్ సేన్ మాట్లాడుతూ....ఒక మంచి సినిమా చేయాల‌నే ఏడాది పాటు గ్యాప్ తీసుకున్నా. ఫంకీ మూవీ రెండు గంటల పది నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా న‌వ్విస్తూనే ఉంటుంది. థియేట‌ర్‌లో సినిమా చూస్తున్న‌ప్పుడు ఫోన్ పెట్టుకోవాలనే ఆలోచనే రాదు అని అన్నాడు. ఫంకీలోని పంచ్‌లు బాగుంటాయి. ప్రతి సీన్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. న‌వ్వుకోవ‌డం కోసమే థియేటర్‌కు వ‌చ్చే వారిని నిరాశ‌ప‌ర‌చ‌దు. జాతిరత్నాలుతో ఎంత ఆకట్టుకున్నాడో ఫంకీతో కూడా అదే స్థాయిలో అనుదీప్ మెప్పిస్తాడు అని నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ అన్నారు. ఫంకీ మూవీకి భీమ్స్ మ్యూజిక్ అందించాడు. న‌రేష్‌, వీటీవీ గ‌ణేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

 ;

Advertisement
Advertisement