త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vishnu Priya | హీరోయిన్‌గా విష్ణుప్రియ – ఇంద్ర లోకం నుంచి వ‌చ్చిన ఊర్వ‌శిగా…

యాంక‌ర్ విష్ణుప్రియ హీరోయిన్‌గా మారింది. ఇంద్ర‌లోకం నుంచి భూమిపైకి అడుగుపెట్టిన ఊర్వ‌శిగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అల్ల‌రి న‌రేష్ హీరోగా రంభ ఊర్వ‌శి మేన‌క పేరుతో సోషియో ఫాంట‌సీ కామెడీ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో ఊర్వ‌శిగా విష్ణుప్రియ న‌టిస్తోండ‌గా...రంభ‌గా రాశిసింగ్‌, మేన‌క‌గా ప్రిషా రాజేష్ సింగ్ క‌నిపించ‌బోతున్నారు.

N

Entertainment | Published On Aug 11, 2026, 5.49 pm IST

Vishnu Priya | హీరోయిన్‌గా విష్ణుప్రియ – ఇంద్ర లోకం నుంచి వ‌చ్చిన ఊర్వ‌శిగా…
Advertisement

Vishnu Priya | యాంక‌ర్ విష్ణుప్రియ ల‌క్కీ ఛాన్స్ కొట్టేసింది. హీరోయిన్‌గా త్వ‌ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అల్ల‌రి న‌రేష్ క‌థానాయ‌కుడిగా సోషియో ఫాంట‌సీ కామెడీ క‌థ‌తో తెర‌కెక్కుతోన్న మూవీ రంభ ఊర్వ‌శి మేన‌క‌. హాస్య మూవీస్‌తో క‌లిసి అన్న‌పూర్ణ స్టూడియోస్ ప‌తాకంపై హీరో నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. చంద్ర‌మోహ‌న్ చింతాడ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో సుర‌భితో పాటు విష్ణుప్రియ‌, రాశీ సింగ్, ప్రిషా రాజేష్ సింగ్‌ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

టీజ‌ర్ రిలీజ్‌....

మంగ‌ళ‌వారం రంభ ఊర్వ‌శి మేన‌క టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ఆద్యంతం ఫ‌న్నీగా ఈ టీజ‌ర్ సాగింది. త‌న వ‌ద్ద ఉన్న ఓ మ్యాజిక్ బుక్ సాయంతో రంభ ఊర్వ‌శి, మేన‌కల‌ను భూమిపైకి తీసుకురావాల‌ని ఓ యువ‌కుడు ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. అత‌డు చేసే పూజ‌ల‌కు ఇంద్రుడు సైతం భ‌య‌ప‌డిపోతుంటాడు. చివ‌ర‌కు అత‌డు కోరుకున్న‌ట్లుగా ముగ్గురు భూమిపైకి వ‌స్తారు. రంభ, ఊర్వ‌శి, మేన‌క కోసం త‌ప‌స్సు చేసిన ఆ యువ‌కుడు చివ‌ర‌కు వారి కార‌ణంగా ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడ‌నే అంశాల‌తో స‌ర‌దాగా ఈ టీజ‌ర్ సాగింది. అల్ల‌రి న‌రేష్ పంచ్‌లు ఆక‌ట్టుకున్నాయి. ఈ టీజ‌ర్‌లో రంభ‌గా రాశీసింగ్‌, ఊర్వ‌శిగా విష్ణుప్రియ‌, మేన‌క‌గా ప్రిషా రాజేష్ సింగ్ క‌నిపించారు. ఇంద్రుడి పాత్ర‌ను వెన్నెల కిషోర్ పోషించారు. ఈ టీజ‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. సెప్టెంబ‌ర్ 4న రంభ ఊర్వ‌శి మేన‌క మూవీ థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ఊర్వ‌శి గెట‌ప్‌లో...

టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.ఈ వేడుక‌కు ఊర్వ‌శి గెట‌ప్‌లోనే విష్ణుప్రియ అటెండ్ అయ్యింది. ఇటీవ‌ల కాలంలో ఎదుర‌వుతోన్న కాంట్ర‌వ‌ర్సీల‌పై రియాక్ట్ అయ్యింది. "నేను ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ప‌దేళ్లు దాటిపోయింది. ఇన్నాళ్లు బుల్లితెర‌కే ప‌రిమిత‌మ‌య్యా. సినిమాల్లో మంచి రోల్‌లో న‌న్ను నేను చూసుకోవాల‌నే క‌ల ఈ సినిమాతో తీర‌బోతుంది, నా క్యారెక్ట‌ర్ అంద‌రిని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది" అని అన్న‌ది. "విష్ణుప్రియ అంటేనే వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిపోతుంది ఎందుక‌లా" అని అడిగిన ప్ర‌శ్న‌కు వెరైటీగా రియాక్ట్ అయ్యింది. "ఈ సినిమా గురించే మాట్లాడుకుందాం" అంటూ బ‌దులిచ్చింది.

Advertisement
Advertisement