Nayan Sarika | లాయర్ కావాలనుకున్నా.. సినిమాలపై ఇష్టం కెరీర్‌గా మారిందన్న నయన్ సారిక..!
Nayan Sarika | చిన్న సినిమాలతో సత్తా చాటుతూ కెరీర్‌లో సక్సెస్ సాధించిన యువ హీరోయిన్ నయన్ సారిక, ‘గం గం గణేశా’తో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘క’, ‘ఆయ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల దగ్గర మరింత దగ్గరైంది. తాజాగా ఆమె శ్రీవిష్ణుతో కలిసి ‘విష్ణువిన్యాసం’లో నటించింది.
Entertainment | Published On Feb 25, 2026, 11.35 am IST
Nayan Sarika | చిన్న సినిమాలతో సత్తా చాటుతూ కెరీర్‌లో సక్సెస్ సాధించిన యువ హీరోయిన్ నయన్ సారిక, ‘గం గం గణేశా’తో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘క’, ‘ఆయ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల దగ్గర మరింత దగ్గరైంది. తాజాగా ఆమె శ్రీవిష్ణుతో కలిసి ‘విష్ణువిన్యాసం’లో నటించింది. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జీ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కానుంది. ఈ క్రమంలో నయన్ సారిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
విష్ణువిన్యాసంలో నయన్ సారిక తన పాత్ర ‘మనీషా’ గురించి వివరించింది ‘ఈ పాత్ర చాలా ప్రత్యేకం. డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. మొదట్లో కొంచెం డామినెంట్‌గా, అబ్బాయిలకు చిన్న అసౌకర్యం కలిగించేలా ఉంటుంది. కానీ కథ మెల్లగా సాగిన తర్వాత ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకున్న ప్రేక్షకులు ఆ పాత్రను ఇష్టపడతారు’ అని పేర్కొంది. టీజర్‌పై స్పందిస్తూ.. ‘టీజర్‌లోని కొన్ని సీన్స్ కథను బాగా ప్రతిబింబిస్తాయి. మనీషా జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ఆ తర్వాత జీవితం హాయిగా, స్ఫూర్తిగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. కాలేజీలో ఫ్యాకల్టీగా కనిపిస్తాను. విష్ణు క్యారెక్టర్ కూడా లెక్చరర్. ఇద్దరి మధ్య జరిగే ప్రేమకథ యువత, విద్యార్థులకి బాగా కనెక్ట్ అవుతుంది’ అని తెలిపింది. ‘నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను. నా ఫస్ట్ తెలుగు సినిమా ‘గం గం గణేశా’తో టాలీవుడ్‌లో నా ప్రయాణం మొదలైంది. ‘ఆయ్’, ‘క’ సినిమాల తర్వాత ఇప్పుడు ‘విష్ణు విన్యాసం’లో నటిస్తున్నాను. భవిష్యత్తులో కూడా తెలుగు సినిమాలను నా ప్రధాన ప్రాధాన్యంగా కొనసాగించాలనుకుంటున్నాను. మంచి కథ, క్యారెక్టర్‌లో బలం ఉన్న సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తాను’ అని వివరించింది.
‘శ్రీవిష్ణుతో పని చాలా సరదాగా అనిపించింది. ఆయన జోవియల్ పర్సన్. మాటలు వినడానికి హాయిగా ఉంటాయి. కామెడీ టైమింగ్ చాలా సహజంగా ఉంటుంది. ఆయనతో కలసి నటించడం చాలా సులభంగా, ఫన్‌గా అనిపించింది. యదునాథ్ మారుతీ రావు చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఆయన కథ చెప్పిన విధానం, సీన్స్ ప్లాన్ చేయడం చాలా ఆసక్తికరంగా ఉంది. నిర్మాతలు కూడా ప్రతీ అంశంలో మద్దతు అందించారు. సుమంత్ నాయుడు జీ సినిమాకు కావలసిన ప్రతీ వనరును సమకూర్చారు. చిన్నప్పటి నుంచి నటి అవ్వాలనుకోలేదు. మొదట లాయర్ కావాలని అనుకున్నాను. కానీ సినిమాలపై ఉన్న ఇష్టం నా కెరీర్‌గా మారింది. నటనలోనే చాలా సంతోషంగా ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఫిల్మ్‌ఫేర్ అవార్డులను చూస్తూ పెరిగాను. అదే వేదికపై అవార్డు అందుకోవడం నా కల నెరవేరింది. నా డ్రీమ్ ప్రాజెక్ట్ రాజమౌళి సినిమాలో నటించడం. ప్రస్తుతం ‘రాకాస’ అనే ఫాంటసీ కామెడీతో పాటు, కన్నడలో ‘గోల్డెన్ స్టార్ గణేష్’తో మరో సినిమా చేస్తున్నాను’ అంటూ వివరించింది.
Read Also :
OTT | తెలుగులో రిలీజ్ అవుతోన్న తమిళ కాంట్రవర్షియల్ బోల్డ్ మూవీ – ఏ ఓటీటీలో చూడాలంటే?
kalki 2 | ప్రభాస్ కల్కి 2 షూటింగ్ షురూ – నలభై ఏళ్ల తర్వాత ఒకే సెట్స్‌లో కమల్, అమితాబ్
Hero Nani | మంచు విష్ణు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన హీరో నాని – ఆ సినిమాలు ఏవంటే?
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



