OTT | తెలుగులో రిలీజ్ అవుతోన్న తమిళ కాంట్రవర్షియల్ బోల్డ్ మూవీ – ఏ ఓటీటీలో చూడాలంటే?
ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించిన తమిళ కాంట్రవర్షియల్ బోల్డ్ మూవీ హాట్ స్పాట్ టూ మచ్ తెలుగులోకి రాబోతుంది. ఫిబ్రవరి 27న నేరుగా ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
Entertainment | Published On Feb 24, 2026, 8.17 pm IST
OTT | ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించిన కోలీవుడ్ అంథాలజీ మూవీ హాట్ స్పాట్ టూ మచ్ తెలుగులోకి రాబోతుంది. తమిళంలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ తెలుగులో మాత్రం నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. హాట్‌స్పాట్ టూ మచ్ మూవీ ఫిబ్రవరి 27 నుంచి ఆహా తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
కోలీవుడ్ హీరో...
అంథాలజీగా తెరకెక్కిన హాట్‌స్పాట్ టూ మచ్ మూవీలో ప్రియా భవానీ శంకర్‌తో పాటు తంబిరామయ్య్, ఎమ్ఎస్ భాస్కర్, భవానీ శ్రీ, బ్రిగడసాగా కీలక పాత్రల్లో నటించారు. తమిళ హీరో విష్ణువిశాల్ నిర్మించిన ఈ మూవీకి విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. జనవరిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీపై చాలా విమర్శలు వచ్చాయి. మహిళల వస్త్రధారణ విషయంలో దర్శకుడు చూపించిన సీన్లు, డైలాగ్స్‌పై ఫెమినిస్ట్‌లు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వలింగ సంపర్కం, ఫ్యానిజంపై సినిమాలోని డైలాగ్స్‌పై విమర్శలు వచ్చాయి.
ఆరు ఓటీటీలలో...
హాట్‌స్పాట్ టూ మచ్ తమిళ వెర్షన్ ఇటీవలే ఓటీటీలో రిలీజైంది. ఒకే రోజు ఆరు ఓటీటీలలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళ్, లయన్స్ గేట్ ప్లే, సింప్లీ సౌత్‌తో పాటు షార్ట్ ఫిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ ఓటీటీ లలో రిలీజైంది. తెలుగులో మాత్రం ఒకే ఓటీటీలో విడుదల అవుతోంది.
పాజిటివ్ టాక్...
2024లో వచ్చిన హాట్‌స్పాట్ మూవీకి సీక్వెల్‌గా హాట్ స్పాట్ టూ మచ్ మూవీ తెరకెక్కింది. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నఈ మూవీ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. పది కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. హాట్‌స్పాట్ ఫ్రాంఛైజ్‌లో మూడో పార్ట్‌ను కూడా తెరకెక్కించబోతున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.
బోల్డ్ కాన్సెప్ట్‌తో...
బోల్డ్ కాన్సెప్ట్‌తో మూడు కథల సమాహారంగా హాట్ స్పాట్ టూ మచ్ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ విఘ్నేష్ కార్తీక్. ఈ కథలు, పాత్రలను పరిచయం చేసే పాత్రలో హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ కనిపించింది.స్టార్ హీరోల ఫ్యాన్స్ వార్స్ హద్దులు దాటితే జరిగే అనార్థాలు ఏమిటి? ఈ ఫ్యాన్స్ వార్ ఓ కుటుంబంలో ఎలాంటి విషాదాన్ని నింపిందనే పాయింట్‌తో ఓ కథ సాగుతుంది. ఆడపిల్లల దుస్తుల విషయంలో నేటి కాలానికి చెందిన ఓ కూతురికి, పాతతరం భావాలు కలిగిన తండ్రికి నెలకొన్న సంఘర్షణను మరో కథలో బోల్డ్‌గా ఆవిష్కరించారు డైరెక్టర్. మూడో కథను టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్‌స్టోరీగా మలిచారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telugu OTT | ఒకే రోజు ఒకే ఓటీటీలో రిలీజైన రెండు తెలుగు సినిమాలు …ఒకటి క్రైమ్ థ్రిల్లర్…మరోటి సైన్స్ ఫిక్షన్
మే 19, 2026

Telugu OTT | ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం క్రైమ్ కామెడీ మూవీ – టీవీ దొంగతనంలో ట్విస్ట్‌లు
మే 7, 2026

Dacoit OTT | నెలరోజుల్లోనే ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ తెలుగు మూవీ
మే 3, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



