త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anushka Sharma | మ‌హేష్‌బాబు సినిమాలో విరాట్ కోహ్లి వైఫ్‌ – వార‌ణాసిపై సోష‌ల్ మీడియాలో మ‌రో కొత్త రూమ‌ర్‌?

మ‌హేష్‌బాబు వార‌ణాసి మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమ‌ర్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి భార్య‌, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

N

Entertainment | Published On Mar 21, 2026, 3.28 pm IST

Anushka Sharma | మ‌హేష్‌బాబు సినిమాలో విరాట్ కోహ్లి వైఫ్‌ – వార‌ణాసిపై సోష‌ల్ మీడియాలో మ‌రో కొత్త రూమ‌ర్‌?
Advertisement

Anushka Sharma | మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న వార‌ణాసి మూవీపై రోజుకో కొత్త రూమ‌ర్ వినిపిస్తోంది. భార‌తీయ పురాణాల నేప‌థ్యంలో హాలీవుడ్ స్టాండ‌ర్డ్స్‌తో టైమ్ ట్రావెల్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌గా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. ఇందులో మ‌హేష్‌బాబు శ్రీరాముడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. రామాయ‌ణంతో పాటు ప‌లు పౌరాణిక అంశాల ప్ర‌స్తావ‌న వార‌ణాసిలో ఉండ‌బోతుంద‌ని స‌మాచారం. పూర్తి స్థాయి ఐమాక్స్ ఫార్మెట్‌లో తెర‌కెక్కుతోన్న ఫ‌స్ట్ తెలుగు మూవీగా వార‌ణాసి నిల‌వ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా షూటింగ్ 65 శాతానికిపైగా కంప్లీట్ అయిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోన్న షెడ్యూల్‌లో మ‌హేష్‌బాబు, విల‌న్‌గా నటిస్తోన్న పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. రాజ‌మౌళి.

విరాట్ కోహ్లి వైఫ్‌...

కాగా వార‌ణాసి మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమ‌ర్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శ‌ర్మ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు సోషల్ మీడియాలో రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. వార‌ణాసి కోసం ఓ స‌ర్‌ప్రైజింగ్ క్యారెక్ట‌ర్‌ను రాజ‌మౌళి స్పెష‌ల్‌గా డిజైన్ చేశార‌ట‌. ఈ క్యారెక్ట‌ర్‌ కోసం ప‌లువురు బాలీవుడ్ హీరోయిన్ల‌ను అనుకున్న రాజ‌మౌళి చివ‌ర‌కు అనుష్క శ‌ర్మ‌ను అప్రోచ్ అయిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఓకే చెప్ప‌లేదా?

కోహ్లి వైఫ్‌గానే కాకుండా బాలీవుడ్ హీరోయిన్‌గా అనుష్క శ‌ర్మ‌కు ఉన్న క్రేజ్ సినిమాకు హెల్ప‌వ్వ‌డ‌మే కాకుండా ఆడియెన్స్ కూడా థ్రిల్లింగ్‌గా ఫీల‌వుతార‌ని రాజ‌మౌళి అండ్ టీమ్ భావించిన‌ట్లు స‌మాచారం. కానీ అనుష్క శ‌ర్మ మాత్రం వార‌ణాసి మూవీకి ఇంకా ఓకే చెప్ప‌లేద‌ని అంటున్నారు.

షారుఖ్‌ఖాన్ మూవీ త‌ర్వాత‌...

అనుష్క శ‌ర్మ సినిమాల‌కు దూర‌మై ఎనిమిదేళ్ల‌పైనే అవుతుంది. చివ‌ర‌గా షారుఖ్‌ఖాన్ జీరో మూవీలో న‌టించింది. 2018లో రిలీజైన ఈ సినిమా త‌ర్వాత యాక్టింగ్‌కు బ్రేక్ ఇచ్చింది. టీమిండియా ఉమెన్స్ క్రికెట‌ర్‌ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా చ‌క్‌దా ఎక్స్‌ప్రెస్ పేరుతో అనుష్క శ‌ర్మ ఓ బ‌యోపిక్ మూవీ చేసింది. షూటింగ్ పూర్త‌యిన అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా రిలీజ్‌కు నోచుకోలేదు. వార‌ణాసి మూవీతో సినిమాల్లోకి అనుష్క శ‌ర్మ రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు.
వార‌ణాసి మూవీలో గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది. దాదాపు 1300 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతుంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement