Ranveer Singh | లగ్జరీ కారు కొన్న ధురంధర్ హీరో – బాలీవుడ్‌లో సెకండ్ సెలిబ్రిటీ
ధురంధర్, ధురంధర్ 2 సక్సెస్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలీవుడ్ హీరో రణవీర్‌సింగ్ ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. హమ్మర్ బ్రాండ్‌కు చెందిన ఈ కారు ధర దాదాపు నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలకుపైనే ఉంటుందని సమాచారం.
Entertainment | Published On Sep 3, 2026, 5.38 pm IST
Ranveer Singh | ధురంధర్, ధురంధర్ 2 సినిమాలతో రణవీర్ సింగ్ బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులన్నీ తిరగరాశాడు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాలుగా ఇవి నిలిచాయి. రణవీర్‌సింగ్‌తో సినిమా అంటే వంద కోట్లు దాటడమే గొప్ప అనే విమర్శలు ఉండేవి. ధురంధర్ ఫ్రాంచైజ్‌తో ఈ రూమర్స్‌కు చెక్ పెట్టాడు.
పేరు ప్రఖ్యాతులు, స్టార్‌డమ్ పరంగానే కాకుండా ఆర్థికంగా ఈ స్పై యాక్షన్ సినిమాలు రణవీర్‌సింగ్‌కు భారీగా కలిసి వచ్చాయి.
లాభాల్లో వాటా...
రెమ్యూనరేషన్‌తో కాకుండా లాభాల్లో వాటా తీసుకునే పద్దతిలో ధురంధర్, ధురంధర్ 2 సినిమాలు చేశాడు రణవీర్ సింగ్. ఈ రెండు సినిమాలతో బాలీవుడ్ హీరోకు 325 కోట్లకుపైనే దక్కినట్లు సమాచారం. ఈ సక్సెస్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్న రణవీర్‌సింగ్ ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు.
లగ్జరీ కారు...
హమ్మర్ బ్రాండ్‌కు చెందిన ఈవీ కారు ధర నాలుగు కోట్ల డెబ్భై ఐదు లక్షలకుపైనే ఉంటుందని సమాచారం. ఈ లగ్జరీ కారుతో ముంబైలోని ఓ ప్రొడక్షన్ ఆఫీస్‌కు రణవీర్‌సింగ్ వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్‌లో హమ్మర్ ఈవీ కారును కొనుగోలు చేసిన సెకండ్ సెలిబ్రిటీగా ధురంధర్ హీరో నిలిచాడు. అతడి కంటే ముందు డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇటీవలే హమ్మర్ ఈవీ కారును తీసుకున్నాడు.
జాంబీ థ్రిల్లర్...
ధురంధర్ 2 తర్వాత ప్రళయ్ పేరుతో ఓ జాంబీ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. జై మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
కొత్త కారు కొన్న ధురంధర్ హీరో రణవీర్ సింగ్. Hammer ev మోడల్ కు చెందిన ఈ కారు ధర 5 కోట్ల వరకు ఉంటుందని టాక్#Ranveersingh #Bollywood pic.twitter.com/qAkICe1GkV
— Tollywoodtopics (@filmytopics) September 3, 2026
సంబంధిత వార్తలు

Anushka Sharma | బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీకి సీక్వెల్ – గెస్ట్ రోల్స్‌లో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ
సెప్టెంబర్ 12, 2026

Ameesha Patel | బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో దొంగతనం – పనిమనిషి అరెస్ట్
సెప్టెంబర్ 12, 2026

Mookuthi Amman 2 | దీపావళి బరిలో బిగ్ క్లాష్..! రామాయణానికి పోటీగా మూకుత్తి అమ్మన్..!
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
- ●TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
- ●TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!

Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు



