Ramayana | సీతగా సాయిపల్లవి ఎలా కనిపిస్తుందో తెలియదు : దీపికా చిఖ్లియా
Ramayana | రామానంద్ సాగర్ తెరకెక్కించిన ‘రామాయణం’ టీవీ సీరియల్ అప్పట్లో వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. 80, 90 దశకాల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నది. రాముడి పాత్రలో అరుణ్ గోవిల్, సీతగా మెప్పించిన దీపికా చిఖ్లియా తమదైన నటనతో మెప్పించారు.ఇప్పటికీ రాముడు, సీత పాత్రలు అనగానే ప్రేక్షకుల మనసులో వీరిద్దరి రూపాలే మెదులుతుంటాయి.
Entertainment | Published On Jul 25, 2026, 4.50 pm IST
Ramayana | రామానంద్ సాగర్ తెరకెక్కించిన ‘రామాయణం’ టీవీ సీరియల్ అప్పట్లో వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. 80, 90 దశకాల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నది. రాముడి పాత్రలో అరుణ్ గోవిల్, సీతగా మెప్పించిన దీపికా చిఖ్లియా తమదైన నటనతో మెప్పించారు.ఇప్పటికీ రాముడు, సీత పాత్రలు అనగానే ప్రేక్షకుల మనసులో వీరిద్దరి రూపాలే మెదులుతుంటాయి. ఇటీవల నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణ’ చిత్రంలో సీత పాత్రకు సాయిపల్లవిని ఎంపిక చేయడంపై దీపిక స్పందించారు. సాయిపల్లవి మంచి నటి అని ప్రశంసించిన ఆమె.. సీత పాత్రలో ఆమె ఎలా కనిపిస్తారో మాత్రం చెప్పలేనన్నారు. ప్రముఖ సినీ పత్రిక ‘వెరైటీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ.. సాయిపల్లవి నటనను తాను చూశానని, ఆమె అద్భుతమైన ప్రతిభ ఉన్న నటి అని చెప్పారు. అయితే, సీత పాత్రకు ఆమె రూపం ఎలా సరిపోతుందో తనకు తెలియదన్నారు.
రూపం కూడా ముఖ్యమే..
తులసీదాస్ రామాయణంలో సీతను ప్రత్యేకమైన లక్షణాలతో వర్ణించారని దీపికా గుర్తుచేశారు. బాదం ఆకారంలోని కళ్లు, ఆకర్షణీయమైన రూపం, ఒత్తైన జుట్టు, అందమైన వర్ణంతో సీత పాత్రను చిత్రీకరించారని తెలిపారు. రామానంద్ సాగర్ కూడా అలాంటి లక్షణాలు ఉన్న నటి కోసం ఆ రోజుల్లో వెతికారని, తనలో ఆ రూపాన్ని చూశారని చెప్పారు. ప్రస్తుతం ‘రామాయణం’లో నటిస్తున్న వారంతా మంచి నటులేనని, అయితే వారు ఆయా పాత్రలకు ఎంతగా సరిపోతారన్నది తెరపై కనిపిస్తుందన్నారు.
ప్రేక్షకులకు ప్రత్యేక అనుబంధం..
పౌరాణిక కథల్లోని పాత్రలతో ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందని దీపికా తెలిపారు. తెరపై ఒకసారి ఓ రూపాన్ని చూసిన తర్వాత అదే భావనను భవిష్యత్‌లోనూ కొనసాగించాలని కోరుకుంటారని చెప్పారు. ఇలాంటి పాత్రలకు నటీనటులను ఎంపిక చేసే సమయంలో వారి రూపం, వ్యక్తిత్వం, పాత్రకు తగ్గ భావవ్యక్తీకరణ వంటి అంశాలను దర్శకులు పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. పౌరాణిక పాత్రలను పోషించడం నటులకు కూడా పెద్ద సవాలేనని తెలిపారు.
దీపావళికి రిలీజ్..
నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణ’ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం ట్రైలర్‌ను ఈ నెల 24న రిలీజ్ చేయాల్సి ఉండగా.. వాయిదాపడింది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు. సన్నీ డియోల్, రవి దూబే, రకుల్ ప్రీత్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత
- ●Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం
- ●Pralhad Joshi Education Minister | ధర్మేంద్ర ప్రధాన్ ఔట్.. కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి
- ●IND Vs ZIM | జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. అయ్యర్ కెప్టెన్ తొలి సిరీస్ కైవసం..

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!

Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం



