త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Katrina Kaif | అప్పుడు దీపికా … ఇప్పుడు క‌త్రినా – ప్ర‌భాస్ సినిమాను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్లు

ప్ర‌భాస్ హీరోగా సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియ‌న్ మూవీ స్పిరిట్‌లో బాలీవుడ్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే క‌త్రినాను క‌లిసిన డైరెక్ట‌ర్ సందీప్ వంగా క‌థ‌ను వినిపించిన‌ట్లు తెలిసింది. కానీ స్పిరిట్ సినిమాను ఈ బాలీవుడ్ బ్యూటీ రిజెక్ట్ చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

N

Entertainment | Published On Jul 27, 2026, 4.32 pm IST

Katrina Kaif | అప్పుడు దీపికా … ఇప్పుడు క‌త్రినా – ప్ర‌భాస్ సినిమాను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్లు
Advertisement

Katrina Kaif | ప్ర‌భాస్ హీరోగా సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పిరిట్ సినిమా కోసం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. హై ఇంటెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌కాష్ రాజ్‌, వివేక్ ఒబెరాయ్‌తో పాటు ఐశ్వ‌ర్య దేశాయ్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

కీల‌క పాత్ర‌లో...

ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ క‌త్రినాకైఫ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మాతృత్వ బంధం కార‌ణంగా గ‌త రెండేళ్లుగా సినిమాల‌కు బ్రేక్ తీసుకుంది క‌త్రినా కైఫ్‌. స్పిరిట్‌తోనే ఆమె సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

రోల్ లెంగ్త్ త‌క్కువే...

స్పిరిట్‌లో క‌త్రినా కైఫ్ రోల్ లెంగ్త్ త‌క్కువే అయినా డిఫ‌రెంట్‌గా ఉండేలా సందీప్ వంగా డిజైన్ చేశార‌ట‌. క‌థ‌లో ఓ కీల‌క సంద‌ర్భంలో ఎంట్రీ ఇస్తుంద‌ని అంటున్నారు. చాలా స‌ర్‌ప్రైజింగ్‌గా ఉండ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తుంది. వారం క్రిత‌మేఈ బాలీవుడ్ బ్యూటీని క‌లిసిన సందీప్ వంగా క‌థ‌ను కూడా వినిపించాడ‌ట‌. కానీ క‌త్రినా మాత్రం ఈ మూవీని రిజెక్ట్ చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

కండీష‌న్లు...

తొలుత ఈ సినిమాలో దీపికా ప‌డుకోణ్‌ను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని ప్లాన్ చేశారు సందీప్ వంగా. దీపికా పెట్టిన కండీష‌న్ల కార‌ణంగా షూటింగ్ మొద‌లుకాక‌ముందే ఆమెను ప‌క్క‌న‌పెట్ట‌డం వివాదాస్ప‌ద‌మైంది. దీపికా త‌ర్వాత ఇప్పుడు క‌త్రినా కైఫ్ కూడా స్పిరిట్‌ను రిజెక్ట్ చేయ‌డం బాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. స్పిరిట్‌తో పాటు ప్ర‌భాస్ మ‌రో మూవీ క‌ల్కి సీక్వెల్ నుంచి కూడా దీపికా ప‌డుకోణ్‌ను మేక‌ర్స్ ప‌క్క‌న‌పెట్టారు.

స్పిరిట్ మూవీకి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దాదాపు మూడు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా షూటింగ్ న‌ల‌భై శాతం వ‌ర‌కు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. 2027 మార్చి 5న స్పిరిట్ రిలీజ్ కాబోతుంది. స్పిరిట్‌తో పాటు ప్ర‌స్తుతం క‌ల్కి 2, ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు ప్ర‌భాస్‌.

 

Advertisement
Advertisement