Vijay Sethupathi | స్లమ్‌డాగ్‌కు గుమ్మడికాయ కొట్టిన పూరి జగన్నాథ్ – విజయ్ సేతుపతి లేకుండానే క్లైమాక్స్ షూట్
విజయ్ సేతుపతి, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్ షూటింగ్ పూర్తయ్యింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్నఈ సినిమాను ఛార్మీతో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీలో టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Entertainment | Published On Oct 17, 2026, 7.35 pm IST
Vijay Sethupathi | కోలీవుడ్ వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్ షూటింగ్ పూర్తయ్యింది. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఛార్మీతో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్లమ్‌డాగ్ సినిమాకు పూరి జగన్నాథ్ గుమ్మడికాయ కొట్టేశారు. శనివారం నాటితో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తిచేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ ఫొటోను ఛార్మీ అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఛార్మీ, పూరి జగన్నాథ్‌తో పాటు సంయుక్త కనిపిస్తోన్నారు.
విజయ్ సేతుపతి లేకుండానే...
ఈ ఫొటో చూస్తుంటే విజయ్ సేతుపతి లేకుండానే చివరి రోజు షూటింగ్ జరిగినట్లు కనిపిస్తోంది. సంయుక్త మీనన్‌పై బ్యాలెన్స్‌గా మిగిలిన సీన్లను తీసినట్లు సమాచారం. పూరి జగన్నాథ్ శైలి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు అంతర్లీనంగా ఓ మెసేజ్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం.
అంధుడిగా...
ఈ సినిమాలో విజయ్ సేతుపతి అంధుడి పాత్రలో నటిస్తోండగా..టబు పోలీస్ రోల్ చేస్తోంది. కన్నడ సీనియర్ హీరో దునియా విజయ్ విలన్‌గా కనిపించబోతున్నారు. త్వరలోనే స్లమ్‌డాగ్ రిలీజ్ డేట్‌ను రివీల్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో విడుదల చేయబోతున్నారు.
కెరీర్‌కు కీలకం...
ఇస్మార్ట్ శంకర్ తర్వాత డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. అతడి కెరీర్‌కు స్లమ్‌డాగ్ సక్సెస్ కీలకంగా మారింది. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జరీనా వహాబ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sheela Rajkumar | రణబాలిలో అలివేలు – జైలర్ 2లో పార్వతి – రెండు సినిమాల్లో నటించిన తమిళ నటి ఎవరంటే?
అక్టోబర్ 16, 2026

Vijay Deverakonda | అఫీషియల్ – “మనం” డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ సినిమా – జానర్ ఇదే
అక్టోబర్ 16, 2026

Ranabaali Review | రణబాలి రివ్యూ … విమర్శలకు బదులిచ్చేందుకు విజయ్ చేసిన సినిమానా?
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●Hyderabad Police | పోలీసులమని చెప్పి.. కిడ్నాప్ చేసి కోటి వసూల్
- ●Sirens, Multiple Horns Cases | సైరన్, మల్టీ హారన్లతో నిబంధనల ఉల్లంఘన.. 304 కేసులు నమోదు
- ●MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికలు.. కోదండరాంతో మహేశ్ కుమార్ గౌడ్ చర్చ
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Madhu Goud Yaskhi | మోదీ పాలన.. ప్రమాదంలో రాజ్యాంగం
- ●Rashmika Mandanna | సద్దుల బతుకమ్మ సంబరాల్లో విరోష్ జోడీ - రష్మికకు డిప్యూటీ సీఎం దంపతుల కానుక

Hyderabad Police | పోలీసులమని చెప్పి.. కిడ్నాప్ చేసి కోటి వసూల్

Sirens, Multiple Horns Cases | సైరన్, మల్టీ హారన్లతో నిబంధనల ఉల్లంఘన.. 304 కేసులు నమోదు

MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికలు.. కోదండరాంతో మహేశ్ కుమార్ గౌడ్ చర్చ

Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు



