త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Police | పోలీసులమని చెప్పి.. కిడ్నాప్ చేసి కోటి వసూల్

Hyderabad Police | హైద‌రాబాద్ న‌గ‌రంలో సంచ‌ల‌నం సృష్టించిన కిడ్నాప్ ముఠా గుట్టుర‌ట్టు అయింది. రామాంత‌పూర్‌కు చెందిన‌ వ్యాపారి శ్రీనివాస్ రావుని కిడ్నాప్ చేసి రూ. 1.30 కోట్లు వ‌సూలు చేసిన 10 మంది స‌భ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

S

Hyderabad | Published On Oct 17, 2026, 7.26 pm IST

Hyderabad Police | పోలీసులమని చెప్పి.. కిడ్నాప్ చేసి కోటి వసూల్
Advertisement

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన కిడ్నాప్ ముఠా గుట్టురట్టు
10 మంది నిందితుల అరెస్ట్
రూ. 1.07 కోట్ల నగదు, 118 గ్రాముల స్వర్ణాభరణాలు
5 వాహనాలు, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం
చిక్కడ్‌పల్లి పోలీసులు. సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్

Hyderabad Police | త్రినేత్ర న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో సంచ‌ల‌నం సృష్టించిన కిడ్నాప్ ముఠా గుట్టుర‌ట్టు అయింది. రామాంత‌పూర్‌కు చెందిన‌ వ్యాపారి శ్రీనివాస్ రావుని కిడ్నాప్ చేసి రూ. 1.30 కోట్లు వ‌సూలు చేసిన 10 మంది స‌భ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు, సికింద్రాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆప‌రేష‌న్ చేప‌ట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 1.07 కోట్ల న‌గ‌దుతో పాటు 118 గ్రాముల ఆభ‌ర‌ణాలు, 5 వాహ‌నాలు, 9 మొబైల్ ఫోన్ల‌ను సీజ్ చేశారు. నిందితుల్లో ప‌లువురికి కిడ్నాప్, దోపిడీ, చీటింగ్ వంటి తీవ్ర‌మైన నేర చ‌రిత్ర ఉందని పోలీసులు తెలిపారు.

నిందితులు వీరే..

తుర్క‌యాంజాల్‌కు చెందిన దుమావ‌త్ శ్రీకాంత్‌(37), అత్తాపూర్ వాసులు గుంజాపోగు సురేశ్ అలియాస్ సూర్య‌(31), గూడెం శ్రావణ్ కుమార్ అలియాస్ రవి(19), చంపాపేట్ వాసి బండారి శామ్సన్ అలియాస్ లక్కీ (22), కూక‌ట్‌ప‌ల్లి వాసి బురానీ ధ‌న్‌సింగ్‌(26), ఎల్ల‌మ్మ బండ వాసులు సర్దార్ కుల్దీప్ సింగ్ (27), బౌరీ భీమ్ సింగ్ (29), హీరా సింగ్ (28), కిష‌న్ బాగ్ వాసి సర్దార్ గోవింద్ సింగ్ (31), ఆసిఫ్‌న‌గర్ వాసి రామగళ్ల ప్రసాద్ (26) ఉన్నారు.

పరారీలో ఉన్న నిందితులు వీరే

ఏపీలోని గిద్ద‌లూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి, క‌ర్ణాట‌క‌కు చెందిన వికాస్ ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement