Rashmika Mandanna | సద్దుల బతుకమ్మ సంబరాల్లో విరోష్ జోడీ – రష్మికకు డిప్యూటీ సీఎం దంపతుల కానుక
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్ వద్ద జరుగనున్న సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హాజరుకాబోతున్నారు. పెళ్లి తర్వాత తొలి దసరాకు తెలంగాణలో జరుపుకుంటున్న రష్మికకు డిప్యూటీ సీఎం దంపతులు బతుకమ్మ చీరను బహుమతిగా అందజేశారు.
Entertainment | Published On Oct 17, 2026, 6.56 pm IST
Rashmika Mandanna | సద్దుల బతుకమ్మ సంబరాల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సందడి చేయబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఆదివారం జరుగనున్నాయి. ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ట్యాంక్‌బండ్ తీరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. కాగా ఈ సద్దుల బతుకమ్మ ఉత్సవంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొనబోతున్నారు. విరోష్ జోడీ ఈ వేడుకలకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు.
తెలంగాణ ఆడపడుచులతో కలిసి రష్మిక మందన్న బతుకమ్మ ఆడబోతున్నట్లు సమాచారం.
ప్రత్యేక ఏర్పాట్లు...
సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్రత్యేకంగా లేజర్ షోతో పాటు ఏడు వందల మంది జానపద కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలను ప్రభుత్వం నిర్వహించబోతున్నట్లు చెబుతోన్నారు.
బతుకమ్మ చీర...
పెళ్లి తర్వాత తొలి దసరాను తెలంగాణలో జరుపుకుంటున్న రష్మిక మందన్నకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు బతుకమ్మ చీరను బహుకరించారు. శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆయన నివాసంలో విజయ్, రష్మిక కలిశారు. ఈ సందర్భంగా రష్మికకు డిప్యూటీ సీఎం దంపతులు బతుకమ్మ చీరను కానుకగా అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్‌రెడ్డి
అక్టోబర్ 17, 2026

Ranabaali Vs Jailer 2 | రణబాలి వర్సెస్ జైలర్ 2 – రజనీకాంత్, విజయ్ దేవరకొండ మధ్య గట్టిపోటీ – ఎక్కువ కలెక్షన్స్ దేనికంటే?
అక్టోబర్ 17, 2026

Sheela Rajkumar | రణబాలిలో అలివేలు – జైలర్ 2లో పార్వతి – రెండు సినిమాల్లో నటించిన తమిళ నటి ఎవరంటే?
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●Madhu Goud Yaskhi | మోదీ పాలన.. ప్రమాదంలో రాజ్యాంగం
- ●Tirumala | పుష్పక విమానంపై గోవర్ధనగిరిధారిగా మలయప్పస్వామి
- ●Firecrackers Seized | ఇంట్లోనే 20 లక్షల విలువైన పటాకులు.. ఎక్కడంటే!
- ●Harish Rao | 7 వేలకే పోలీసు నోటిఫికేషన్.. నిరుద్యోగులను వంచించడమే
- ●Bhu-Aadhaar | ప్రతి భూ కమతానికి 14 అంకెల భూ ఆధార్
- ●Drugs | డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా బైక్ ర్యాలీ







