Ranabaali Review | రణబాలి రివ్యూ … విమర్శలకు బదులిచ్చేందుకు విజయ్ చేసిన సినిమానా?
1870 దశకంలో బ్రిటీషర్ల నిరంకుశ విధానాలను ఎదురించి రాయలసీమ ప్రాంతంలో చాలా మంది పాలెగాళ్లు పోరాటం చేశారు. అలాంటి యోధుల జీవితాల నుంచి స్ఫూర్తి పొంది డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ రణబాలి సినిమా చేశారు. తెలంగాణ నేటివిటీ సినిమాలు తప్ప ఆంధ్రా, రాయలసీమ కథలకు సెట్టవ్వడనే విమర్శలకు విజయ్ ఈ సినిమాతో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.
Entertainment | Published On Oct 16, 2026, 7.24 pm IST
Ranabaali Review | ఆంగ్లేయుల భారతదేశాన్ని సుమారు రెండు వందల ఏళ్లు పాలించారు. వారి అణిచివేత, ఆధిపత్యధోరణిని ఎదురించి పోరాడిన యోధుల కథలతో తెలుగు తెరపై చాలానే సినిమాలు వచ్చాయి. ఇందులో చాలా వరకు ఫిక్షనల్ అంశాలతోనే రూపొందాయి. హీరోయిజం, కమర్షియల్ హంగులకే వీటిలో ప్రాధాన్యతనిచ్చారు. బ్రిటీషర్ల అన్యాయాలు, అక్రమాల కారణంగా సమిధలుగా మారిపోయిన సామాన్యుల వ్యథలు, కన్నీటి గాథలను స్క్రీన్‌పై చూపించే ప్రయత్నాలు చాలా అరుదుగా జరిగాయి. అలాంటి వాటిలో రణబాలి ఒకటి.
మహా కరువు...
1876 -78 మధ్యకాలంలో మద్రాస్ మహా కరువు బారిన పడి కోటి మంది ప్రజలు మరణించారు. కరువు ప్రభావం రాయలసీమపైనే ఎక్కువగా పడిందంటూ చరిత్రకారులు చెబుతుంటారు. ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే కరువును పట్టించుకోకుండా బ్రిటీష్ అధికారులు లక్షలాది టన్నుల బియ్యం, గోధుమలను ఇంగ్లాండ్‌కు ఎగుమతి చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ప్రజల ఆకలిని అడ్డుపెట్టుకొని వారిని కట్టుబానిసలుగా మార్చుకొని వెట్టిచాకిరీ చేయించారు. వంద ఏళ్లయినా ఆ కన్నీటి జాడల తాలూకు ఆనవాళ్లు, కథలు మాత్రం ఇప్పటికీ కనిపిస్తూనే, వినిపిస్తూనే ఉంటాయి. ఆ కష్టాల బారి నుంచి రాయలసీమ ప్రజలను కాపాడటం కొందరు పాలెగాళ్లు ఆయుధాలు చేతపట్టారు. అలాంటి యోధుల జీవితాల నుంచి స్ఫూర్తి పొంది రణబాలి కథను రాసుకున్నారు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్.
శింగనమల రణబాలి...
శింగనమల సంస్థానాన్ని కాపాడుకోవడం కోసం పధ్నాలుగేళ్లకే కొడుకుశింగనమల బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ)చేత కత్తిపట్టిస్తుంది లక్ష్మమ్మ. జాలి, దయ అనేవి లేకుండా మొరటోడిగా కొడుకును పెంచుతుంది. శింగనమల ఊరికి సంరక్షకుడిగా మారతాడు. పొలిమేర దాటి శత్రువు ఎవడైనా ఊరిలో అడుగుపెడితే రణబాలి అస్సలు సహించడు. అలాంటి రణబాలి జీవితంలోకి జయమ్మ (రష్మిక మందన్న) భార్యగా అడుగుపెడుతుంది. తొలుత భర్త మొరటుతనం చూసి జయమ్మ భయపడుతుంది. కానీ అతడిలోని మంచితనం గ్రహించి ఇష్టపడటం మొదలుపెడుతుంది.
మద్రాస్ ప్రెసిడెన్సీకి సర్ థియేడర్ హెక్టర్ కమీషనర్‌గా వస్తాడు. బ్రిటీషర్ల మెప్పును పొందడం కోసం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇంగ్లాండ్‌కు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. కరువుతో ప్రజలు విలవిలలాడుతుంటే పట్టించుకోకుండా వారి కష్టాన్ని దోచుకోవడం మొదలుపెడతాడు. ఎదురుతిరిగిన వారిని చంపేస్తుంటాడు. ప్రజల ఆకలిని అడ్డుపెట్టుకొని వారిని రైల్వే ట్రాక్ నిర్మాణంలో కూలీలుగా మారుస్తాడు. ఓ చిన్నారి కారణంగా హెక్టర్ అక్రమాల గురించి రణబాలికి తెలుస్తుంది. ఈ కరువు చావులకు బ్రిటీషర్లే కారణమని గ్రహించి వారిని దోచుకోవడం మొదలుపెడతాడు. తాను దోచిన సంపదను, ఆహార ధాన్యాలను పేద ప్రజలకు పంచుతుంటాడు. హెక్టర్ అన్యాయాలు, అక్రమాలను ఎదురించి రణబాలి ఎలాంటి పోరాటం చేశాడు? భర్త పోరాటానికి జయమ్మ ఎలా అండగా నిలిచింది? ఎలాంటి త్యాగానికి సిద్ధపడింది? రణబాలిని చంపేందుకు హెక్టర్ ఎలాంటి కుట్రలు పన్నాడు అన్నదే ఈ సినిమా మిగిలిన కథ.
కత్తి మీద సామే...
స్వాతంత్య్ర పోరాటాలతో ముడిపడిన కథలతో సినిమాలు చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. ఉన్నది ఉన్నట్లుగా స్క్రీన్‌పై ఆవిష్కరిస్తే డాక్యుమెంటరీ ఫీల్ కలుగుతుంది. అలాగని ఐటెమ్‌సాంగ్స్, కామెడీ ట్రాక్‌లాంటి జోడిస్తూ ఎక్కువ స్వేచ్ఛ తీసుకుంటే అసలుకే ఎసరు వస్తుంది. కొన్ని లిమిటేషన్స్‌కు లోబడే ఈ సినిమాలు చేయాలి. తాను చెప్పాలనుకున్న కథను స్క్రీన్‌పై ఆవిష్కరించాలి. అదే సమయంలో ఆడియెన్స్ కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా చూసుకోవాలి. రణబాలితో రాహుల్ సాంకృత్యాన్ అదే చేశారు.
వాస్తవ కథ...
ఓ వైపు వాస్తవ కథను చెబుతూనే మరోవైపు విజయ్ దేవరకొండ, రష్మిక ట్రాక్‌తో ఆడియెన్స్‌ను కథలో లీనం చేసేందుకు ప్రయత్నించారు. హీరోను లక్ష్యం వైపు నడిపించే ఓ ఫోర్స్ కోసం మైథాలజీ ట్రాక్‌ను కథలో జోడించాడు. ఎటొచ్చి ఈ ప్రయత్నంలో ఎక్కువ టైమ్ తీసుకోవడమే సినిమాకు లోపంగా మారింది.
చరిత్రలో మరుగున పడిన కొన్ని నిజాలు కళ్లకు కట్టినట్లుగా చూపించాలంటే సమయం పడుతుంది. రాహుల్ సాంకృత్యాన్ కూడా కథలోని ప్రతి అంశాన్ని చాలా డీటైలింగ్‌గా చెప్పుకుంటూ వెళ్లాడు. ఎంతలా అంటే కథను బిల్డ్ చేయడానికే ఫస్ట్ హాఫ్ మొత్తం తీసుకున్నాడు. ఓ వైపు బ్రిటీషర్ల అకృత్యాలు, మరోవైపు విజయ్ , రష్మిక ట్రాక్‌తో ఫస్ట్ హాఫ్ ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా సాగిపోతుంది. వారి లవ్‌స్టోరీ చాలా నాచురల్‌గా ఉంది.
నిజాయితీగా...
కరువుతో అల్లాడుతోన్న పేదలకు సాయం చేసేందుకు బ్రిటీషర్లను ఎదురించి రణబాలి సాగించిన పోరాటాన్ని సెకండాఫ్‌లో చూపించాడు. బ్రిటీషర్ల స్థావరాలపై హీరో దాడి చేయడం లాంటి సీన్లను హీరోయిజం, ఎలివేషన్లతో లార్జెన్దేన్ లైఫ్ ఉన్నట్లుగా చూపించే అవకాశం ఉంది. కానీ దర్శకుడు మాత్రం సహజత్వానికే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. బ్రిటీషర్లను పాలెగాళ్లను ఇలాగే ఎదురించి ఉంటారనేలా నిజాయితీగా చూపించాడు.
విమర్శలకు సమాధానం...
విజయ్ తెలంగాణ యాస తప్ప మరోటి మాట్లాడలేదు. యూత్ రిలేటెడ్ రోల్స్‌కు మాత్రమే సెట్టవుతాడనే చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలకు ఈ సినిమాతో బదులిచ్చే ప్రయత్నం చేశాడు. రణబాలి పాత్రలో జీవించాడు. రాయలసీమ యాత్రలో అతడి డైలాగ్స్ బాగున్నాయి. జయమ్మ పాత్రలో ఎక్కడ రష్మిక కనిపించలేదు. పూర్తిగా జయమ్మే కనిపించింది. అంతలా పాత్రను ఓన్ చేసుకుంది. మిగిలిన పాత్రల ధారలు నటన బాగుంది.
హాలీవుడ్ విలన్ ఆర్నాల్డ్ వోస్లో మాత్రం ఈ సినిమాకు అలంకార ప్రాయమే అయ్యాడు. అతడిని దర్శకుడు సరిగ్గా వాడుకోలేదు. రాయలసీమ ప్రాంతాన్ని తలపించేలా వేసిన సెట్లు, గండికోటతో పాటు రియలిస్టిక్ లోకేషన్లు ఈ కథకు ప్రాణం పోశాయి.
ఎవరూ చెప్పని ఓ కఠిన నిజాన్ని వెండితెరపై ఆవిష్కరించే నిజాయితీతో కూడిన మంచి ప్రయత్నం రణబాలి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Twisha Sharma case | తెలుగు నటి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. భోపాల్ కోర్టులో విచారణపై స్టే
అక్టోబర్ 16, 2026

Prabhas | ఎట్టకేలకు ప్రభాస్ కల్కి 2 షూటింగ్ షురూ – సాయిపల్లవి కోసం వెయిటింగ్?
అక్టోబర్ 16, 2026

Jailer 2 OTT | రజనీకాంత్ జైలర్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే – నెల రోజుల్లోనే స్ట్రీమింగ్
అక్టోబర్ 15, 2026
తాజావార్తలు
- ●Lulu Mall | లూలూ మాల్.. కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు ప్రత్యక్షం..!
- ●Bathukamma | 17న బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్ ప్రదానం
- ●NDA | ఎన్డీఏతో డీఎంకే దోస్తీ?
- ●FSSAI | నూనె ప్రకటనలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా.. బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు!
- ●Railway | రాళ్లు రువ్వడం, దొంగతనాలకు చెక్.. రైల్వే ట్రాక్‌లపై నిఘా..!
- ●CM Revanth Reddy | నిమ్జ్‌లో హ్యుందాయ్ ఆర్ అండ్ డీ కేంద్రం

Lulu Mall | లూలూ మాల్.. కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు ప్రత్యక్షం..!

Bathukamma | 17న బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్ ప్రదానం

NDA | ఎన్డీఏతో డీఎంకే దోస్తీ?

FSSAI | నూనె ప్రకటనలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా.. బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు!



