త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | బీ అల‌ర్ట్.. రేపు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | త్రినేత్ర న్యూస్ : ఈ నెల 18న స‌ద్దుల బ‌తుక‌మ్మ పండుగ నేప‌థ్యంలో సైబ‌రాబాద్ పోలీసులు( Cyberabad Police ) అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

S

Hyderabad | Published On Oct 17, 2026, 7.05 pm IST

Traffic Restrictions | బీ అల‌ర్ట్.. రేపు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర న్యూస్ : ఈ నెల 18న స‌ద్దుల బ‌తుక‌మ్మ పండుగ నేప‌థ్యంలో సైబ‌రాబాద్ పోలీసులు( Cyberabad Police ) అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఆదివారం సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని ఐడీఎల్ లేక్( IDL Lake ) వ‌ద్ద ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌యాణికులు, వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను చూసుకోవాల‌ని సూచించారు. కూక‌ట్‌ప‌ల్లి వై జంక్ష‌న్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్, హ‌ఫీజ్‌పేట వైపు వెళ్లే వాహ‌న‌దారులు ట్రాఫిక్ పోలీసులు సూచించే మార్గాల్లో వెళ్లాల‌న్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌కుండా వాహ‌న‌దారులు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Advertisement
Advertisement