త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Deverakonda | అఫీషియ‌ల్ – “మ‌నం” డైరెక్ట‌ర్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా – జాన‌ర్ ఇదే

టాలీవుడ్‌లో మ‌రో కొత్త కాంబినేష‌న్ ఫిక్స్ అయ్యింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కే కుమార్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా రాబోతుంది. ర‌ణ‌బాలి రిలీజ్ సంద‌ర్భంగా మూవీ టీమ్ శుక్ర‌వారం పాత్రికేయుల స‌మావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ ప్రెస్‌మీట్‌లో విక్ర‌మ్ కే కుమార్ సినిమాను విజ‌య్ దేవ‌ర‌కొండ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాడు.

N

Entertainment | Published On Oct 16, 2026, 7.53 pm IST

Vijay Deverakonda | అఫీషియ‌ల్ –  “మ‌నం” డైరెక్ట‌ర్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా – జాన‌ర్ ఇదే
Advertisement

Vijay Deverakonda |  విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ర‌ణ‌బాలి మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించింది. 1870 ద‌శ‌కంలో బ్రిటీష‌ర్లు సాగించిన అకృత్యాల‌కు ఓ యోధుడి పోరాటాన్ని జోడించి ద‌ర్శ‌కుడు రాహుల్ సాంకృత్యాన్ రూపొందించిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ ల‌భిస్తోంది.

రొమాంటిక్ కామెడీ మూవీ...

ర‌ణ‌బాలి రిలీజ్ సంద‌ర్భంగా మూవీ టీమ్ శుక్ర‌వారం పాత్రికేయుల స‌మావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ సంద‌ర్భంగా కొత్త మూవీని విజ‌య్ దేవ‌ర‌కొండ అనౌన్స్‌చేశారు. మ‌నం డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కే కుమార్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. రొమాంటిక్ కామెడీ జాన‌ర్‌లో రూపొంద‌నున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం అని విజ‌య్ అన్నారు.

ర‌ణ‌బాలి బెస్ట్ మూవీ...

ఈ పాత్రికేయుల స‌మావేశంలో ర‌ణ‌బాలి గురించి విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ..."ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన బెస్ట్ ఫిలిం ఇది . నాతో పాటు ర‌ష్మిక కెరీర్ లో గర్వపడే సినిమా అవుతుంది. ఇది నా 14వ సినిమా. చాలా ఏళ్ల‌యినా ఒక సినిమా గురించి, అందులోని పర్ ఫార్మెన్స్ గురించి, ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి మాట్లాడుకునే సినిమాలు కొన్నే ఉంటాయి. అలాంటి సినిమానే రణబాలి. ర‌ణ‌బాలి చేస్తున్నప్పుడే పెద్ద హిట్ కొట్టాలి, పెద్ద నెంబర్స్ క్రియేట్ చేయాలని అటెంప్ట్ చేయలేదు. ఈ సినిమా తెలుగు ఆడియెన్స్‌కు చూపించడం చాలా ముఖ్యమని భావించి చేశాం. నా ఫిల్మోగ్రఫీ, తెలుగు సినిమా ఫిల్మోగ్రఫీలో రణబాలి స్పెష‌ల్ ఫిల్మ్‌గా మిగులుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది. ఒక్కో హీరో తనకు నచ్చిన కథను తెరపైకి తెస్తుంటారు, అయితే కొన్ని కారణాల వల్ల సినిమా, దాని చుట్టూ ఉన్న బిజినెస్ ఒక పరుగుపందెం మారుతోంది" అని చెప్పారు.

 

Advertisement
Advertisement