త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. కోదండ‌రాంతో మ‌హేశ్ కుమార్ గౌడ్ చ‌ర్చ‌

MLC Elections | తెలంగాణ జనసమితి (TJS) కార్యాలయంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ టీజేఎస్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీజేఎస్ పార్టీల మధ్య ఉన్న రాజకీయ భాగస్వామ్యం, పరస్పర సహకారం, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

S

Telangana | Published On Oct 17, 2026, 7.12 pm IST

MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. కోదండ‌రాంతో మ‌హేశ్ కుమార్ గౌడ్ చ‌ర్చ‌
Advertisement

MLC Elections | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ జనసమితి (TJS) కార్యాలయంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ టీజేఎస్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీజేఎస్ పార్టీల మధ్య ఉన్న రాజకీయ భాగస్వామ్యం, పరస్పర సహకారం, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ భాగస్వామ్యంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ వివిధ సందర్భాల్లో అందిస్తున్న మద్దతు, సహకారం రాజకీయంగా ప్రాధాన్యత కలిగి ఉన్నాయని తెలిపారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీజేఎస్ ప్రధాన భూమిక పోషించాలని, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు అందించాలని టీజేఎస్ నాయకులను కోరినట్లు వెల్లడించారు. ఎన్నికలతో పాటు ఇతర రాజకీయ సందర్భాల్లోనూ టీజేఎస్ కాంగ్రెస్‌కు సహకరిస్తూ వస్తోందని పేర్కొన్నారు.

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ప్రొఫెసర్ కోదండరామ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్, టీజేఎస్ పార్టీల మధ్య సమన్వయం, పరస్పర సహకారం కొనసాగాలని, రానున్న ఎన్నికల్లోనూ కలిసి పనిచేయాలని ఈ సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement