త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Deverakonda | రణబాలి టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..

Vijay Deverakonda | విజయ్‌ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘రణబాలి’. విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమాకు ‘టాక్సీ’ ఫేమ్‌ రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో, చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

P

Entertainment | Published On Sep 7, 2026, 4.40 pm IST

Vijay Deverakonda | రణబాలి టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..
Advertisement

Vijay Deverakonda | విజయ్‌ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘రణబాలి’. విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమాకు ‘టాక్సీ’ ఫేమ్‌ రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో, చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలుత సెప్టెంబర్‌ 11న సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ.. కొన్ని కారణాలతో రిలీజ్‌ డేట్‌ను అక్టోబర్‌ 16కు వాయిదా వేశారు.

టీజర్‌తో ప్రమోషన్స్‌కు శ్రీకారం

సినిమా విడుదలకు సమయం దగ్గరపడటంతో మేకర్స్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ‘రణబాలి’ టీజర్‌ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్‌ 9న టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా రూపొందించిన ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, అప్‌డేట్స్‌తో ఆసక్తిని పెంచిన చిత్రబృందం.. టీజర్‌తో ‘రణబాలి’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనుంది.

చారిత్రక నేపథ్యంతో..

19వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. బ్రిటీష్‌ పాలన సమయంలో 1854 నుంచి 1878 మధ్య జరిగిన కొన్ని చారిత్రక ఘటనలను ఆధారంగా చేసుకుని కథను రూపొందించినట్లు సమాచారం. దీంతో సినిమాలో యాక్షన్‌తో పాటు అప్పటి కాలానికి సంబంధించిన పరిస్థితులు, పాత్రలు, రాజకీయ పరిణామాలు కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండను ఇంతకుముందెన్నడూ చూడని పాత్రలో దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ చూపించనున్నారనే ప్రచారం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

భారీ నిర్మాణంలో..

రణబాలి మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. టీ-సిరీస్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. కథకు తగ్గట్టుగా భారీ సెట్స్‌, విజువల్స్‌, యాక్షన్‌ సన్నివేశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అజయ్‌–అతుల్‌ ద్వయం ఈ చిత్రానికి సంగీతం అందిస్తోంది. మరి సెప్టెంబర్‌ 9న విడుదల కానున్న టీజర్‌ ‘రణబాలి’పై అంచనాలను మరింత పెంచుతుందో లేదో చూడాల్సిందే.

Advertisement
Advertisement