త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | విజ‌య్ దేవ‌ర‌కొండ స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ – హీరోయిన్‌గా ర‌ష్మిక?

టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ని అంటున్నారు. మాడాక్‌ ఫిల్మ్స్ నిర్మించ‌నున్న ఈ బాలీవుడ్ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది.

N

Entertainment | Published On May 29, 2026, 5.00 pm IST

Rashmika Mandanna | విజ‌య్ దేవ‌ర‌కొండ స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ – హీరోయిన్‌గా ర‌ష్మిక?
Advertisement

Rashmika Mandanna |  సినిమాల జోరును పెంచుతున్నారు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ర‌ణ‌బాలి, రౌడీ జ‌నార్ధ‌న సెట్స్‌పై ఉండ‌గానే ఇటీవ‌లే హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ డైరెక్ష‌న్‌లో ఓ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. మైథ‌లాజిక‌ల్ జాన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఇటీవ‌ల గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో పాన్ ఇండియ‌న్ మూవీని ప‌ట్టాలెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే తెలుగు మూవీ కాద‌ట‌. స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

మాడాక్‌  ఆఫీస్‌లో...

విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్ మూవీకి మ‌నం, 24 సినిమాల ఫేమ్ విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ట‌. హిందీ అగ్ర నిర్మాణ సంస్థ మాడాక్‌ ఫిల్మ్స్ఈ  సినిమాను నిర్మించ‌నుంద‌ని అంటున్నారు. గురువారం మాడాక్‌ ఫిల్మ్స్ ఆఫీస్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, విక్ర‌మ్ కే కుమార్ క‌లిసి క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అవుతోన్నాయి. ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్ డిస్క‌ష‌న్స్ కోస‌మే మాడోక్ ఆఫీస్‌కు విజ‌య్‌, విక్ర‌మ్ వ‌చ్చిన‌ట్లు చెబుతోన్నారు.

తెలుగులో రిలీజ్‌...

విక్ర‌మ్ కే కుమార్ గ‌త సినిమాల శైలిలోనే డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఈ హిందీ సినిమా రూపొంద‌నుంద‌ని అంటున్నారు. హిందీలో రూపొంద‌నున్న ఈ సినిమాను తెలుగుతో పాటు ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లో రిలీజ్ చేసేలా ప్లాన్స్ చేస్తున్నార‌ట‌. గ‌తంలో మాడాక్ బ్యాన‌ర్‌లో వ‌చ్చిన స్త్రీ, స్త్రీ 2, ముంజ్యా, థామాతో క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద హిట్స్‌గా నిలిచాయి.

ర‌ష్మిక హీరోయిన్‌?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, విక్ర‌మ్ కే కుమార్ బాలీవుడ్ మూవీలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మాడాక్‌  బ్యాన‌ర్‌లో థామా సినిమా చేసింది ర‌ష్మిక మంద‌న్న‌. హార‌ర్ కామెడీగా రూపొందిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. థామా రిలీజ్ టైమ్‌లోనే ర‌ష్మిక‌తో మ‌రో మూవీ చేసేందుకు మాడాక్‌ ఫిల్మ్స్ అగ్రిమెంట్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. పెళ్లి త‌ర్వాత విజ‌య్, ర‌ష్మిక‌ల‌కు ఏర్ప‌డిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని వారిద్ద‌రి కాంబినేష‌న్‌లోనే ఈ బాలీవుడ్ సినిమా చేయాల‌ని నిర్మాత‌లు ఫిక్సైన‌ట్లు స‌మాచారం. విజ‌య్‌, ర‌ష్మిక కాంబినేష‌న్‌లో రానున్న ఫ‌స్ట్ హిందీ ప్రాజెక్ట్‌గా విక్ర‌మ్ కే కుమార్ మూవీ నిల‌వ‌నునున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.
ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న క‌లిసి ర‌ణ‌బాలి సినిమా చేస్తోన్నారు. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 15న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. కాగా  విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వివాహ బంధంలో ఒక్క‌టైన సంగ‌తి తెలిసింది.

 

Advertisement
Advertisement