త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Deverakonda | హీరో నాని క్లాప్‌తో మొద‌లైన విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త మూవీ – మైథాల‌జీ బ్యాక్‌డ్రాప్‌లో…

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న కొత్త మూవీ సోమ‌వారం అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది. ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్‌కు నాని చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యారు. నాని క్లాప్‌తో ఈ సినిమా మొద‌లైంది.

N

Entertainment | Published On Apr 20, 2026, 3.07 pm IST

Vijay Deverakonda | హీరో నాని క్లాప్‌తో మొద‌లైన విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త మూవీ – మైథాల‌జీ బ్యాక్‌డ్రాప్‌లో…
Advertisement

Vijay Deverakonda |  ర‌ణ‌బాలి, రౌడీ జ‌నార్ధ‌న సినిమాలు సెట్స్‌పై ఉండ‌గానే రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో కొత్త సినిమా మొద‌లుపెట్టారు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ కొత్త మూవీని ఇటీవ‌ల అనౌన్స్‌చేశారు. ఈ పాన్ ఇండియ‌న్ మూవీ సోమ‌వారం హైద‌రాబాద్‌లో అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ప్రారంభోత్స‌వ వేడుక‌కు హీరో నాని చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై షూట్ చేసిన ఫ‌స్ట్ సీన్‌కు నాని క్లాప్ కొట్టారు. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

యాక్ష‌న్ రివేంజ్ డ్రామా....

హిస్టారిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ రివేంజ్ డ్రామాగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు హాలీవుడ్ కెమెరామెన్ అలెజాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. స్పైడ‌ర్ మ్యాన్ సినిమాల ఫేమ్ ఎరిక్ డ్ర‌స్ట్ వీఎఫ్ఎక్స్ స‌మ‌కూర్చుతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ మూవీగా ఈ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. వైరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. హేష‌మ్ అబ్దుల్ వ‌హాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతుంది.

ర‌ష్మిక మంద‌న్న‌...

ప్ర‌స్తుతం ర‌ణ‌బాలితో పాటు రౌడీ జ‌నార్ధ‌న సినిమాలు చేస్తున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ర‌ణ‌బాలి సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. రౌడీ జ‌నార్ధ‌న సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ర‌వి కిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement