త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Rashmika | ఐ ల‌వ్ యూ జ‌య‌మ్మ – ర‌ష్మిక‌కు స్పెష‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

భార్య ర‌ష్మిక మంద‌న్న స్పెష‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ చెప్పారు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ర‌ణ‌బాలి మూవీ నుంచి ఓ మేకింగ్ వీడియోను అభిమానుల‌తో పంచుకున్నాడు. ఈ వీడియోకు ఐ ల‌వ్ యూ జ‌య‌మ్మ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు.

N

Entertainment | Published On Apr 5, 2026, 12.57 pm IST

Vijay Rashmika | ఐ ల‌వ్ యూ జ‌య‌మ్మ – ర‌ష్మిక‌కు స్పెష‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌
Advertisement

Vijay Rashmika |  భార్య ర‌ష్మిక మంద‌న్న‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ స్పెష‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ చెప్పారు. ర‌ణ‌బాలి మూవీకి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశాడు. ఇటీవ‌లే విజ‌య్‌, ర‌ష్మిక మూడుముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు క‌లిసి ర‌ణ‌బాలి అనే సినిమా చేస్తున్నారు. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో బ్రిటీష‌ర్ల‌ను ఎదురించి పోరాడిన యోధుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపించ‌బోతున్నారు. అత‌డి భార్య జ‌య‌మ్మ‌గా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది.

మేకింగ్ వీడియో...

ర‌ష్మిక మంద‌న్న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ర‌ణ‌బాలి నుంచి ఓ మేకింగ్ వీడియోను విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానుల‌తో పంచుకున్నారు. జ‌య‌మ్మ పాత్ర కోసం ర‌ష్మిక మేకోవ‌ర్ అయిన తీరును వివ‌రిస్తూ ఈ వీడియో ఆస‌క్తిక‌రంగా సాగింది. ద‌ర్శ‌కుడి సూచ‌న‌ల‌కు అనుగుణంగా రెట్రో లుక్‌లోకి ర‌ష్మిక ఎలా మారిందో ఈ వీడియోలో చూపించారు. జ‌య‌మ్మ పాత్ర కోసం అల‌నాటి మ‌హిళ‌ల‌ను ర‌ష్మిక స్ఫూర్తిగా తీసుకున్న‌ట్లుగా కూడా ఇందులో ఆవిష్క‌రించారు. ఆభ‌ర‌ణాలు, చీర‌క‌ట్టు, హెయిర్‌స్టైల్‌, అలంక‌ర‌ణ...ఇలా ప్ర‌తి విష‌యంలో ర‌ష్మిక తీసుకున్న కేర్‌ను చూపించారు. ఈ వీడియోకు ఐ ల‌వ్ యూ జ‌య‌మ్మ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అత‌డి పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

అనంత‌పూర్‌లో...

ర‌ణ‌బాలి లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవ‌లే అనంత‌పూర్‌లో ముగిసింది. ఈ షెడ్యూల్‌లో విజ‌య్‌, ర‌ష్మిక మంద‌న్న‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్‌. పెళ్లి త‌ర్వాత విజ‌య్‌, ర‌ష్మిక జంట‌గా ఫ‌స్ట్ టైమ్ ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. వీరికి అనంత‌పూర్‌లో ఫ్యాన్స్ గ్రాండ్‌గా వెల్క‌మ్ చెప్పారు.

హాలీవుడ్ న‌టుడు...

ర‌ణ‌బాలి మూవీ సెప్టెంబ‌ర్ 11న రిలీజ్ కాబోతుంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో హాలీవుడ్ న‌టుడు, మ‌మ్మీ ఫేమ్ అర్నాల్డ్ వోస్లో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. బండి నారాయ‌ణ‌స్వామి రాసిన శ‌ప్త‌భూమి న‌వ‌ల ఆధారంగా ర‌ణ‌బాలి మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గీత‌గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తోన్న మూడో సినిమా.

 

Advertisement
Advertisement