త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Deverakonda | విజ‌య్ దేవ‌ర‌కొండ మాస్ ర్యాంపేజ్ – రౌడీ జ‌నార్ధ‌న టైటిల్ గ్లింప్స్ రిలీజ్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ రౌడీ జ‌నార్ధ‌న టైటిల్ గ్లింప్స్ సోమ‌వారం విడుద‌లైంది. యాక్ష‌న్, వ‌య‌లెన్స్ అంశాల‌తో ఈ గ్లింప్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. రౌడీ జ‌నార్ధ‌న సినిమాను 2026 డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

N

Entertainment | Published On Dec 22, 2025, 8.24 pm IST

Vijay Deverakonda | విజ‌య్ దేవ‌ర‌కొండ మాస్ ర్యాంపేజ్ – రౌడీ జ‌నార్ధ‌న టైటిల్ గ్లింప్స్ రిలీజ్‌

విజయ్ దేవరకొండ

Advertisement

Vijay Deverakonda | అభిమానులకు ఫుల్ మాస్ ట్రీట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. అతడు హీరోగా నటిస్తున్న రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. వ‌య‌లెన్స్‌, యాక్ష‌న్ అంశాలు, ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఈ గ్లింప్స్ ఆస‌క్తిని రేకెత్తించింది. ఈ వీడియో గ్లింప్స్‌లో రా అండ్ ర‌స్టిక్‌గా విజ‌య్ క‌నిపించాడు. అత‌డి లుక్‌, బాడీ లాంగ్వేజ్, మ్యాన‌రిజ‌మ్స్ గ‌త సినిమాల‌కు భిన్నంగా ఫుల్ మాసీగా ఉన్నాయి. శ్రీకాకుళంలోని క‌ళింగ‌ప‌ట్నం బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ సాగ‌నున్న‌ట్లు గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చారు. కొమ్ముల‌తో కూడిన ఫేస్ మాస్క్‌లు ధ‌రించి కొంద‌రు యోధులు యుద్ధం చేసే సీన్‌తో గ్లింప్స్ మొద‌లైంది. ఆ త‌ర్వాత ఒంటిపై ష‌ర్ట్ లేకుండా కేవ‌లం లుంగీ ధ‌రించి చేతిలో ర‌క్తంతో త‌డిసిన క‌త్తి ప‌ట్టుకొని విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంట్రీ ఇవ్వ‌డం గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలిచింది. అత‌డిని చాలా మంది రౌడీలు చుట్టుముట్ట‌డం ఆస‌క్తిని పంచుతోంది.

ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నాడో...

గ్లింప్స్‌లోని డైలాగ్స్ శ్రీకాకుళం యాస‌లో వినిపించాయి. బండెడు అన్నం తిని గుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడైనా ఇన్నావా..నేను చూశాను. కొమ్ములతో ఆడి కథనుఆడే రాసుకున్నోడు. క‌న్నీళ్ల‌ను ఒంటికి నెత్తురులా పూసుకున్నోడు. చావు కళ్ల ముందుకు వచ్చి నిలబడితే కత్తి దీసి కలబడ్డాడు అనే డైలాగ్స్‌తో గ్లింప్స్ ఆరంభ‌మైంది. నా కాడా ఉన్నారు కొమ్ములు తిరిగిన రాక్షసులు, రక్తానికి మరిగిన రౌడీలు అంటూ ఓ రౌడీ అన‌గానే... కళింగపట్నంలో ఇంటికో.. రౌడీని అని చెప్పుకొని తిరుగుతాడు. కానీ ఇంటి పేరును రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు. జనార్ధన రౌడీ జనార్ధ‌న అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది. రౌడీ జ‌నార్ధ‌న టైటిల్ గ్లింప్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై శిరీష్‌తో క‌లిసి దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో క్రిస్టో జేవియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.టైటిల్ గ్లింప్స్‌తో పాటు రౌడీ జ‌నార్ధ‌న రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. 2026 డిసెంబ‌ర్‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు వెల్ల‌డించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement