Vijay Rashmika Wedding | ఉదయ్‌పూర్‌లో అడుగుపెట్టిన విరోష్ – పెళ్లి కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేయనున్నారంటే?
తమ పెళ్లిపై విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఆదివారం అఫీషియల్‌గా ప్రకటన చేశారు. విరోష్ పేరుతో వివాహ వేడుకను జరుపుకోబోతున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 26న జరుగనున్న పెళ్లి కోసం సోమవారమే ఉదయ్‌పూర్‌లో అడుగుపెట్టారు.
Entertainment | Published On Feb 23, 2026, 4.39 pm IST
Vijay Rashmika Wedding | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఇన్నాళ్లు తమ వివాహంపై సైలెంట్‌గా ఉంటూ వచ్చిన ఈ జంట ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఒకే పోస్ట్‌ను ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభిమానులు తమకు పెట్టిన విరోష్ పేరుతోనే వివాహ వేడుకను జరుపుకోబోతున్నట్లు ప్రకటించారు.
మూడు రోజుల ముందే...
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న విజయ్, రష్మిక వివాహం జరుగనుంది. మూడు రోజుల ముందే వీరిద్దరు ఉదయ్‌పూర్‌లో అడుగుపెట్టారు. సోమవారం ఉదయం ఉదయ్‌పూర్ బయలుదేరుతూ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విజయ్, రష్మిక కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ వెంట అతడి సోదరుడు ఆనంద్‌తో పాటు మరికొంత మంది సన్నిహితులు, కుటుంబసభ్యులు ఉన్నారు. రష్మికతో పాటు ఆమె కుటుంబసభ్యులు ఉదయ్‌పూర్ వెళ్లినట్లు సమాచారం. మంగళవారం నుంచి పెళ్లి వేడుకలు మొదలుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఐటీసీ మెమోంటోస్...
ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమోంటోస్ హోటల్‌లో విజయ్, రష్మిక పెళ్లి జరుగనుంది. ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ నుంచి పోలీస్ సెక్యూరిటీ మధ్య వీరిద్దరు హోటల్‌కు చేరుకున్నారు. ఉదయ్‌పూర్‌కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అరావళి పర్వత శ్రేణుల మధ్య యాభై ఏకరాల విస్తీర్ణంలో ఈ హోటల్ ఉంటుందట. పురాతన రాజస్థానీ సంస్కృతికి ప్రతిబింబిస్తూ నిర్మించిన ఈ లగ్జరీ హోటల్‌లో 120 వరకు విల్లాలు ఉన్నాయట. ప్రతి విల్లాకు ఓ స్విమ్మింగ్‌పూల్ ఉండటం ఈ హోటల్ ప్రత్యేకత అని అంటున్నారు. పెళ్లి వేడుకల కోసం ప్రత్యేకంగా నిర్మించిన విశాలమైన వేదికలు, ఓపెన్‌లాన్స్ కూడా ఉంటాయట. ఈ హోటల్‌లో ఒక్క రోజు విడిది చేయాలంటే లక్షకుపైనే ఖర్చు చేయాల్సి ఉంటుందని సమాచారం.
మూడు కోట్ల వరకు...
విజయ్, రష్మిక తమ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం భారీగానే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. వీరి పెళ్లికి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి ఓ వంద మంది వరకు అటెండ్ కానున్నట్లు సమాచారం. ఐటీసీ మెమోంటోస్‌లో వెడ్డింగ్ ప్యాకేజీలో కోటిన్నర నుంచి రెండున్నర కోట్ల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఖర్చులు అదనం. విజయ్, రష్మిక తమ పెళ్లి కోసం మూడు నుంచి నాలుగు కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



