త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Rashmika | ర‌ణ‌బాలి సెట్స్‌లో విజ‌య్‌, ర‌ష్మిక – పెళ్లి త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్ జంట‌గా షూటింగ్‌

పెళ్లి త‌ర్వాత తొలిసారి జంట‌గా ర‌ణ‌బాలి మూవీ సెట్స్‌లో అడుగుపెట్టారు విజ‌య్‌, ర‌ష్మిక‌. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం అనంత‌పూర్‌లో జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్ లో విజయ్, ర‌ష్మిక‌ల‌పై ద‌ర్శ‌కుడు రాహుల్ సాంకృత్యాన్ కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

N

Entertainment | Published On Mar 27, 2026, 3.18 pm IST

Vijay Rashmika | ర‌ణ‌బాలి సెట్స్‌లో విజ‌య్‌, ర‌ష్మిక – పెళ్లి త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్ జంట‌గా షూటింగ్‌
Advertisement

Vijay Rashmika |  టాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న ఇటీవ‌లే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్ర‌వ‌రి 26న వీరి పెళ్లి జ‌రిగింది. వివాహ వేడుక‌ల‌ను ప‌ది రోజుల పాటు గ్రాండ్‌గా జ‌రుపుకున్నారు. పెళ్లి కోసం నెల రోజుల పాటు సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన విజ‌య్‌, ర‌ష్మిక ఇటీవ‌లే తిరిగి షూటింగ్‌ల‌ను మొద‌లుపెట్టారు. ఫస్ట్ టైమ్ జంటగా సినిమా సెట్స్‌లో అడుగుపెట్టారు.

ర‌ణ‌బాలి...

ప్ర‌స్తుతం విజ‌య్‌, ర‌ష్మిక క‌లిసి ర‌ణ‌బాలి సినిమా చేస్తోన్నారు. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ పాన్ ఇండియ‌న్ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. కాగా ర‌ణ‌బాలి మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం అనంత‌పురంలో జ‌రుగుతుంది. గురువారం నుంచి మొద‌లైన కొత్త షెడ్యూల్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌ల‌పై ద‌ర్శ‌కుడు రాహుల్ సాంకృత్యాన్ కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నార‌ట‌.. ఏప్రిల్ 6 వ‌ర‌కు ఈ షెడ్యూల్ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం.

పెళ్లి త‌ర్వాత‌...

ఈ సినిమా షూటింగ్ కోసం గురువారం విజ‌య్‌, ర‌ష్మిక అనంత‌పూర్‌లో అడుగుపెట్టిన ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి. పెళ్లి త‌ర్వాత జంట‌గా వీరిద్ద‌రూ షూటింగ్ చేయ‌బోతుండ‌టం ఇదే మొద‌టిసారి కావ‌డంతో అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. దేవుడి ఆశీస్సులు తీసుకొని షూటింగ్ సెట్స్‌లో ఎంట్రీ ఇచ్చారు విజ‌య్‌, ర‌ష్మిక‌. వారికి ఫ్యాన్స్‌ గ్రాండ్‌గా వెల్క‌మ్ చెప్పారు.

శ‌ప్త భూమి న‌వ‌ల‌...

బండి నారాయ‌ణ‌స్వామి రాసిన శ‌ప్త‌భూమి న‌వ‌ల ఆధారంగా ర‌ణ‌బాలి సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాలో హాలీవుడ్ న‌టుడు, మ‌మ్మీ మూవీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఆంగ్లేయుల‌ను ఎదురించి పోరాడిన ర‌ణ‌బాలి అనే యోధుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అత‌డి భార్య జ‌య‌మ్మ‌గా ర‌ష్మిక మంద‌న్న ఈ సినిమాలో క‌నిపించ‌బోతున్నారు. ఈ పాత్ర‌ల కోసం వీరిద్ద‌రూ చాలా మేకోవ‌ర్ అయిన‌ట్లుగా స‌మాచారం.
గీత‌గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న క‌లిసి న‌టిస్తున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 11న రిలీజ్ కాబోతుంది. గ‌తంలో డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్‌తో టాక్సీవాలా అనే సినిమా చేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

Advertisement

తాజావార్తలు

Advertisement